సీహెచ్‌సీని తనిఖీ చేసిన కాయకల్ప బృందం

ABN , First Publish Date - 2023-03-18T00:27:59+05:30 IST

స్థానిక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను శుక్రవారం సాయంత్రం కాయకల్ప బృందం తనిఖీ చేసింది. విజయవాడ నుంచి వచ్చిన బృందంలోని జేడీ డాక్టర్‌ నరసింగరావు నేతృత్వంలో ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు.

సీహెచ్‌సీని తనిఖీ చేసిన కాయకల్ప బృందం
ఆస్పత్రిలో తనిఖీ చేస్తున్న కాయకల్పటీం జేడీ డాక్టర్‌ నరసింగరావు

నక్కపల్లి, మార్చి 17: స్థానిక కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను శుక్రవారం సాయంత్రం కాయకల్ప బృందం తనిఖీ చేసింది. విజయవాడ నుంచి వచ్చిన బృందంలోని జేడీ డాక్టర్‌ నరసింగరావు నేతృత్వంలో ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. స్టాక్‌ రిజిస్టర్లు, ఆస్పత్రి స్టోర్‌లో వున్న మందుల నిల్వలను పరిశీలించారు. జనరల్‌ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో వున్న పలు పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆసపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జనార్దన్‌, డాక్టర్‌ జయలక్ష్మి సహా వైద్యాధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

Updated Date - 2023-03-18T00:27:59+05:30 IST