Share News

చంద్రబాబు తిరుగు ప్రయాణం

ABN , Publish Date - Dec 22 , 2023 | 01:45 AM

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో బుధవారం జరిగిన ‘యువగళం-నవశకం’ బహిరంగ సభలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ గురువారం తిరుగు ప్రయాణమయ్యారు. చంద్రబాబునాయుడు, లోకేశ్‌, భువనేశ్వరితో పాటు వారి కుటుంబ సభ్యులు భోగాపురం నుంచి ఉదయం 10.38 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

చంద్రబాబు తిరుగు ప్రయాణం
విమానాశ్రయంలోకి వెళ్తున్న చంద్రబాబు నాయుడు;

వీడ్కోలు పలికిన పార్టీ నేతలు

గోపాలపట్నం, డిసెంబరు 21:

విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో బుధవారం జరిగిన ‘యువగళం-నవశకం’ బహిరంగ సభలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ గురువారం తిరుగు ప్రయాణమయ్యారు. చంద్రబాబునాయుడు, లోకేశ్‌, భువనేశ్వరితో పాటు వారి కుటుంబ సభ్యులు భోగాపురం నుంచి ఉదయం 10.38 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద సత్యనారాయణతో పాటు పలువురు నేతలు వీడ్కోలు పలికారు. చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో 10.58 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.

21జిపిటి13: విమానాశ్రయంలోకి వెళ్తున్న పవన్‌ కల్యాణ్‌;

పవన్‌కల్యాణ్‌కు...

గోపాలపట్నం, డిసెంబరు 21:

‘యువగళం-నవశకం’ బహిరంగ సభలో పాల్గొని గురువారం తిరిగి ప్రయాణమైన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పార్టీ నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. గురువారం ఉదయం 11.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు జనసేన, టీడీపీ నేతలు వీడ్కోలు పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.

Updated Date - Dec 22 , 2023 | 01:45 AM