నేడు కేంద్ర అదనపు కార్యదర్శి అతీశ్‌చంద్ర రాక
ABN , First Publish Date - 2023-11-20T23:10:27+05:30 IST
భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి అతీశ్‌చంద్ర మంగళవారం మండలంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో మండలంలో వంట్లమామిడి గ్రామంలో వికషిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా గిరిజనులతో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు.
పాడేరు మండలం వంట్లమామిడిలో గిరిజనులతో బహి రంగ సభ
సభ ఏర్పాట్లు పరిశీలించిన ఐటీడీఏ పీవో వి.అభిషేక్
పాడేరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి అతీశ్‌చంద్ర మంగళవారం మండలంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో మండలంలో వంట్లమామిడి గ్రామంలో వికషిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా గిరిజనులతో బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర అదనపు కార్యదర్శి పర్యటన ఏర్పాట్లను ఐటీడీఏ పీవో వి.అభిషేక్ సోమవారం వంట్లమామిడిలో పరిశీలించారు. ప్రధానంగా గిరిజనులతో బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాన్ని పీవో పరిశీలించి, వివిధ శాఖల అధికారులు చేపట్టాల్సిన చర్యలను ఆయన వివరించారు. ఏజెన్సీలో వికషిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించేందుకే కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి వస్తున్నారని ఐటీడీఏ పీవో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఛాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. గిరిజన సహకార సంస్థ, వైద్య ఆరోగ్య, డీఆర్‌డీఏ శాఖకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవోలు వీఎస్ ప్రభాకరరావు, ఎం.వెంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ డీవీఆర్‌ఎం రాజు, ఎంపీడీవో సాయినవీన్, టీడబ్ల్యూ ఏఈఈ దేముళ్లు, ట్రైకార్ అసిస్టెంట్ సీతారామయ్య, తదితరులు పాల్గొన్నారు.