Share News

యువ గళం పాదయాత్రను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2023-12-11T00:36:30+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రను అన్నివర్గాల ప్రజలు జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పిలుపునిచ్చారు.

యువ గళం పాదయాత్రను జయప్రదం చేయండి
బుద్ద నాగజగదీశ్వరరావు,

జిల్లా టీడీపీ అధ్యక్షుడు బుద్ద నాగజదీశ్వరరావు

అనకాపల్లి, డిసెంబరు 10 (ఆంధ్రజోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అనకాపల్లి జిల్లాలో సోమవారం నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రను అన్నివర్గాల ప్రజలు జయప్రదం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో యువగళం పాదయాత్ర సోమవారం పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు. పాయకరావుపేట నుంచి ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల మీదుగా సాగుతుందన్నారు. పరవాడ మీదుగా గాజువాక పాదయాత్ర చేరుకుంటుందని తెలిపారు. టీడీపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కళా వెంకటరావు, వంగలపూడి అనిత, మాజీ మంత్రిలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు హాజరవుతారన్నారు. ఉద్తరాంధ్ర నాయకులు, పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు పాల్గొంటారని తెలిపారు. యువగళం ముగింపు సమావేశం డిసెంబరు 20న విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో ఉంటుందన్నారు.

Updated Date - 2023-12-11T00:36:32+05:30 IST