విద్యుత్‌ ఛార్జీలపై ఫిర్యాదులుంటే 1912కి కాల్‌ చేయండి

ABN , First Publish Date - 2023-07-18T00:37:44+05:30 IST

ఎవరికైనా విద్యుత్‌ బిల్లులు అధికంగా వచ్చాయని, ఏ ఛార్జీ ఎందుకు వేశారో తెలియకపోయినా, అనుమానం ఉన్నా 1912కి కాల్‌ చేస్తే సమాధానం చెబుతారని విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈ మహేంద్రనాఽథ్‌ తెలిపారు.

విద్యుత్‌ ఛార్జీలపై ఫిర్యాదులుంటే 1912కి కాల్‌ చేయండి

విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : ఎవరికైనా విద్యుత్‌ బిల్లులు అధికంగా వచ్చాయని, ఏ ఛార్జీ ఎందుకు వేశారో తెలియకపోయినా, అనుమానం ఉన్నా 1912కి కాల్‌ చేస్తే సమాధానం చెబుతారని విశాఖ సర్కిల్‌ ఎస్‌ఈ మహేంద్రనాఽథ్‌ తెలిపారు. ’’కరెంట్‌ షాక్‌.. విద్యుత్‌ వినియోగదారులపై ఎడాపెడా బాదుడు’’ శీర్షికతో ఈనెల 12న ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై ఆయన స్పందించారు. ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన టారిఫ్‌ ప్రకారమే ఛార్జీలు వసూలు చేస్తున్నామని చెప్పారు. ప్రత్యక్షంగా వివరాలు తెలుసుకోవాలంటే సమీప సెక్షన్‌ ఆఫీసు లేదా ఈఆర్‌ఓ కార్యాలయంలో సంప్రతించాలన్నారు. ట్రూ అప్‌, ఎఫ్‌పీపీసీఏ ఛార్జీలు గణాంకాల ప్రకారమే చార్జీలు వేస్తున్నామన్నారు.

Updated Date - 2023-07-18T00:37:44+05:30 IST