నేత్రపర్వంగా ఉపమాక క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2023-09-20T01:35:00+05:30 IST

మండలంలోని ఉపమాక క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం రాజాధిరాజ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ నేత్రపర్వంగా సాగింది.

నేత్రపర్వంగా ఉపమాక క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
మాఢవీధుల్లో రాజాధిరాజ వాహనంపై వెంకన్న తిరువీధి సేవ

నక్కపల్లి, సెప్టెంబరు 19: మండలంలోని ఉపమాక క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం రాజాధిరాజ వాహనంపై స్వామివారి తిరువీధి సేవ నేత్రపర్వంగా సాగింది. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, నిత్య హోమాలు, బలిహరణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఆలయంలో ధ్వజారోహణం ఘనంగా జరిగింది. ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు, అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు, పీసపాటి శేషాచార్యులు, భాగవతం సాయి గోపాలాచార్యులు, నండూరి రాజ గోపాలాచార్యులు ఆధ్వర్యంలో చతర్వేద పారాయణం, ధ్వజారోహణ సమయంలో ప్రత్యేక హారతులు ఇచ్చారు. భక్తులందరికీ గరుడపొంగలిని పంపిణీ చేశారు.

Updated Date - 2023-09-20T01:35:00+05:30 IST