బూత్‌ కమిటీలను బలోపేతం చేయాలి

ABN , First Publish Date - 2023-04-03T00:50:15+05:30 IST

రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర కోరారు. పాతకర్ణవానిపాలెంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో 11 మందితో కమిటీలను తక్షణమే పూర్తి చేయాలన్నారు.

బూత్‌ కమిటీలను బలోపేతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న మేడపాటి రవీంద్ర

బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర

గాజువాక, ఏప్రిల్‌ 2: రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర కోరారు. పాతకర్ణవానిపాలెంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలో 11 మందితో కమిటీలను తక్షణమే పూర్తి చేయాలన్నారు. అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా చూడాలన్నారు. పార్టీ గాజువాక నియోజకవర్గం కన్వీనర్‌ కరణంరెడ్డి నరసింగరావు మాట్లాడుతూ ఈ నెల ఆరున బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలను చేపట్టనున్నామన్నారు. గాజువాకలో పార్టీ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో నాయకులు గోళి శంకరరావు, దీనంకొండ కృష్ణంరాజు, రోహిణి, వసంతవర్మ, ప్రసాద్‌, లలిత, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-03T00:50:15+05:30 IST