కేంద్ర పథకాలపై బీజేపీ ఇంటింటా ప్రచారం

ABN , First Publish Date - 2023-06-26T00:56:01+05:30 IST

కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కారే రాముడు ఆధ్వర్యంలో నాయకులు మండలంలోని కొప్పగొండుపాలెం, చినకలవలాపల్లి, కొత్తపేట గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇంటింటా ప్రచారం చేశారు.

కేంద్ర పథకాలపై బీజేపీ ఇంటింటా ప్రచారం
కొప్పుగొండుపాలెంలో కరపత్రాలను అందజేస్తున్న బీజేపీ నేతలు

రాంబిల్లి, జూన్‌ 25: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కారే రాముడు ఆధ్వర్యంలో నాయకులు మండలంలోని కొప్పగొండుపాలెం, చినకలవలాపల్లి, కొత్తపేట గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్‌మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధర్మాల వరహా గోవిందరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమంత్రి శ్రీనివాసరావు, జిల్లా సోషల్‌ మీడియా కో-కన్వీనర్‌ సూరాడ నూకరాజు, మండల మాజీ అధ్యక్షుడు ఉమ్మిడి వెంకటేశ్వరు, నాయకులు, కార్యకర్తలు సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. పార్టీ ముద్రించిన కరపత్రాలను అందజేశారు. అనంతరం బీజేపీ నేతలు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా ప్రకటించుకోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు

Updated Date - 2023-06-26T00:56:01+05:30 IST