Share News

విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా బీజేపీ ధర్నా

ABN , Publish Date - Dec 23 , 2023 | 01:01 AM

విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం నెహ్రూచౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎనిమిదిసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచడం దారుణమన్నారు.

విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా బీజేపీ ధర్నా
నెహ్రూచౌక్‌ వద్ద ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 22: విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ బీజేపీ నాయకులు శుక్రవారం నెహ్రూచౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు మాట్లాడుతూ, నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎనిమిదిసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచడం దారుణమన్నారు. పైగా రకరకాల చార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని అన్నారు. విద్యుత్‌ డిమాండ్‌ను అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దీంతో శీతాకాలంలో కూడా విద్యుత్‌ కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు. పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈర్లె శ్రీరామ్మూర్తి, కర్రి రామకృష్ణ, చదరం నాగేశ్వరరావు, బొడ్డేడ నాగేశ్వరరావు, గొంతిన భక్తసాయిరాం, కొణతాల అప్పలరాజు, వుడా రమేశ్‌, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 01:01 AM