పేదలందరికీ మెరుగైన వైద్యం
ABN , First Publish Date - 2023-09-27T01:11:57+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి అన్నారు.
తుమ్మపాల, సెప్టెంబరు 26 : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పేదలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి అన్నారు. మంగళవారం మామిడిపాలెం ఎంపీపీ స్కూల్‌లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఎంపీపీ గొర్లి సూరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి సురక్ష కార్యక్రమంలో రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. రోగులకు పలు వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఎ.హేమంత్, ఎంపీడీవో నరసింహారావు, సర్పంచ్ పూడి పరదేశినాయుడు, ఎంపీటీసీ సభ్యుడు బంధం అప్పలనాయుడు, మండల కో-ఆప్షన్ సభ్యుడు బొండా అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.