రానున్న రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం

ABN , First Publish Date - 2023-02-07T01:05:20+05:30 IST

రానున్న రోజుల్లో బీసీలదే రాజ్యాధికారమని అఖిల భారత ఓబీసీ జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్‌నాయుడు అన్నారు.

రానున్న రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం
సదస్సులో మాట్లాడుతున్న పోతల ప్రసాద్‌నాయుడు

అనకాపల్లి టౌన్‌, ఫిబ్రవరి 6 : రానున్న రోజుల్లో బీసీలదే రాజ్యాధికారమని అఖిల భారత ఓబీసీ జాతీయ అధ్యక్షుడు పోతల ప్రసాద్‌నాయుడు అన్నారు. పట్టణంలోని విజయా రెసిడె న్సీలో ఉత్తరాంధ్ర బీసీ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ ఆడారి కుమారస్వామి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన బీసీ సదస్సులో మాట్లాడారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్‌ ఉండాలని, బీసీ జనగణన నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో జ్యోతిరావుపూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని ఈ బాధ్యత ప్రభుత్వం తీసుకోకుంటే బీసీ సంఘాల నుంచి తామే ఏర్పాటు చేస్తామని చెప్పారు. విద్యా వ్యవస్థలో బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయపరమైన పోరాటం తప్పదన్నారు. అంతకుముందు గాంధీనగరం బీసీ హాస్టల్‌లో ఆయన మొక్కలు నాటి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీఎస్‌ఎన్‌ రాజు, పెంటకోట వెంకటరావు, కాండ్రేగుల చందు, పినబోయిన అప్పారావుయాదవ్‌, విల్లూరి పైడారావు, బొడ్డేడ అప్పారావు, తెలంగాణ ఓబీసీ రాష్ట్ర అధ్యక్షురాలు రోజా రమణి, యాత కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పోలారపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T01:05:20+05:30 IST