పెందుర్తిలో దారుణం

ABN , First Publish Date - 2023-09-11T00:59:36+05:30 IST

విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం చోటుచేసుకుంది. జీవీఎంసీ 96వ వార్డు పరిధిలోని ఓ హౌసింగ్‌ కాలనీలో ఐదేళ్ల చిన్నారిపై అభిషేక్‌ (18) అనే యువకుడు ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

పెందుర్తిలో దారుణం

ఐదేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం

పెందుర్తి , సెప్టెంబరు 10: విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం చోటుచేసుకుంది. జీవీఎంసీ 96వ వార్డు పరిధిలోని ఓ హౌసింగ్‌ కాలనీలో ఐదేళ్ల చిన్నారిపై అభిషేక్‌ (18) అనే యువకుడు ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. సీఐ ఎం.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హౌసింగ్‌ కాలనీలోని ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఆడుకుంటున్న చిన్నారిని అభిషేక్‌ బలవంతంగా సెకండ్‌ ఫ్లోర్‌లోని తన ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో యువకుడి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. అనంతరం చిన్నారిని తిరిగి ఫస్ట్‌ ఫ్లోర్‌లో విడిచిపెట్టి వెళ్లిపోయాడు. చిన్నారి ఏడుస్తుండడంతోపాటు శరీరం కమిలిపోయి వుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది ఏం జరిగిందని అడిగారు. భయం భయంగా జరిగిన విషయాన్ని చిన్నారి తెలిపింది. దీంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు హౌసింగ్‌ కాలనీకి వెళ్లి అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతను చదువు మధ్యలో మానేసి జులాయిగా తిరుగుతున్నాడని సీఐ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-09-11T00:59:36+05:30 IST