అసంపూర్తి కల్యాణ మండపం వద్ద అయ్యన్న సెల్ఫీ ఛాలెంజ్‌

ABN , First Publish Date - 2023-06-03T00:51:30+05:30 IST

నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని బలిఘట్టం ఉత్తరవాహినిలో అసంపూర్తిగా వదిలేసిన కల్యాణ మండపం వద్ద శుక్రవారం మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయన్నపాత్రుడు శుక్రవారం సెల్ఫీ ఛాలెంజ్‌ చేశారు.

   అసంపూర్తి కల్యాణ మండపం వద్ద అయ్యన్న సెల్ఫీ ఛాలెంజ్‌
అసంపూర్తిగా ఉన్న కల్యాణ మండపాన్ని చూపుతున్న అయ్యన్నపాత్రుడు

వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల నుంచి పట్టించుకోలేదని మాజీ మంత్రి విమర్శ

నర్సీపట్నం అర్బన్‌, జూన్‌ 2: నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని బలిఘట్టం ఉత్తరవాహినిలో అసంపూర్తిగా వదిలేసిన కల్యాణ మండపం వద్ద శుక్రవారం మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయన్నపాత్రుడు శుక్రవారం సెల్ఫీ ఛాలెంజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కల్యాణ మండపం నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. గత సాధారణ ఎన్నికల నాటికి 80 శాతం మేర పనులు పూర్తయ్యాయని, తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్మాణాన్ని గాలికొదిలేసిందని ఆరోపించారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదని, దీనిని చూసైనా పేటీఎం బ్యాచ్‌ కళ్లు తెరవాలని అయ్యన్న అన్నారు.

Updated Date - 2023-06-03T00:51:30+05:30 IST