బాలికపై అత్యాచార యత్నం
ABN , First Publish Date - 2023-11-29T00:33:50+05:30 IST
మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి తొమ్మిదేళ్ల బాలికపె ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మల్కాపురం, నవంబర్ 28: మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి తొమ్మిదేళ్ల బాలికపె ఓ వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో నాయుడు అనే వ్యక్తి ఆమె ఇంట్లోకి ప్రవేశించి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దీంతో ఆ బాలిక పెద్దగా కేకలు వేయడంతో నాయుడు పారిపోయాడు. తల్లి ఇంటికి రావడంతో జరిగిన విషయాన్ని బాలిక చెప్పడంతో ఆమె వెంటనే మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దిశ ఏసీపీ వివేనానంద ఆధ్వర్యంలో మల్కాపురం సీఐ జీడీ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.