విశాఖతో అనుబంధం

ABN , First Publish Date - 2023-01-30T01:00:38+05:30 IST

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ (70) ఆదివారం ఉదయం కన్నుమూ శారు.

విశాఖతో అనుబంధం

మూడుసార్లు మంత్రిగా...

2014 తరువాత రాజకీయాలకు దూరం

సాగర్ నగర్ లో నివాసం

కాంగ్రెస్‌ ప్రముఖులతో ఆత్మీయబంధం

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ నేపథ్యం

విశాఖపట్నం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి):

మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ (70) ఆదివారం ఉదయం కన్నుమూ శారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మొదట రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్‌ మరణానంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. 2014లో ఎన్నికల తరు వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తరువాత పూర్తిగా విశాఖకు పరిమితమయ్యారు. ఆయన భార్య మూడే ళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందినట్టు తెలిసింది. సాగర్‌ నగర్‌ బీచ్‌రోడ్డులోని వసంత్‌ పేరుతో ఉన్న నాలుగు అంత స్తుల అపార్ట్‌మెంట్‌లో వసంతకుమార్‌ ఒక్కరే ఉంటున్నారని, ఆయనకు తోడుగా మరో ముగ్గురు యువకులు ఉంటారని సమాచారం. స్థానికంగా ఎవరితోనూ పెద్దగా కలవని ఆయన ఏ అవసరమున్నా స్కూటీపై ఒంటరిగా వెళుతుంటారని స్థానికులు చెబుతున్నారు. ఇకపోతే అతనిని దగ్గర నుంచి చూసిన వారు ఎంత మంచి వారో, అంత కోపిష్టి అని చెబు తుంటారు. మంత్రిగా ఉన్న సమయంలో అవసరమని ఎవరొ చ్చినా సాయం చేసేవారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు పేర్కొం టున్నారు. ఆయన నివాసానికి మూడేళ్ల కిందట పవన్‌ కల్యాణ్‌, పలుమార్లు చిరంజీవి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌, మంత్రి అంబటి రాంబాబు, కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరరావు అనేకసార్లు వచ్చారని చెబుతు న్నారు. వసంతకుమార్‌కు ఏయూ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో పరిశోధన చేసి 2014 సెప్టెంబరు 29న జరిగిన స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ అందుకున్నారు. అపోలో ఆస్పత్రిలో వట్టి భౌతికకాయాన్ని నగర డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ సందర్శించి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ వాదిగా ముద్రపడిన వసంతకుమార్‌ మృతి దుర దృష్టకరమని, పార్టీకి ఆయన ఎంతగానో సేవలందించారని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చోడదాసి సుధాకర్‌ పేర్కొ న్నారు. గొప్ప కాంగ్రెస్‌ వాదిని కోల్పోయామని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వజ్జపర్తి శ్రీనివాసరావు నివాళులర్పించారు.

Updated Date - 2023-01-30T01:00:39+05:30 IST