Share News

కళ్లకు గంతలు కట్టుకుని...

ABN , Publish Date - Dec 17 , 2023 | 01:14 AM

అంగన్‌వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతోంది.

కళ్లకు గంతలు కట్టుకుని...

అంగన్‌వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఉద్యోగుల సమస్యలు పట్టనట్టు వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని ఎత్తిచూపుతూ...కళ్లకు గంతలు కట్టుకుని శనివారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పలువురు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు సమాజ్‌వాదీ పార్టీ నాయకులతోపాటు వివిధ పార్టీలకు చెందిన ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు సంఘీభావం ప్రకటించారు.

- విశాఖపట్నం

Updated Date - Dec 17 , 2023 | 01:14 AM