Share News

ఆదివాసీ ద్రోహి జగన్‌ చింతపల్లి పర్యటన ఎవరి కోసం?

ABN , Publish Date - Dec 19 , 2023 | 12:48 AM

ఆదివాసీల హక్కులు, చట్టాలను కాలరాస్తూ నిలువెల్లా ముంచిన ఆదివాసీ ద్రోహి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చింతపల్లి పర్యటన ఎవరి కోసమని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌ ప్రశ్నించారు.

ఆదివాసీ ద్రోహి జగన్‌ చింతపల్లి పర్యటన ఎవరి కోసం?
మాట్లాడుతున్న బాలదేవ్‌

గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్‌

పాడేరురూరల్‌, డిసెంబరు 18: ఆదివాసీల హక్కులు, చట్టాలను కాలరాస్తూ నిలువెల్లా ముంచిన ఆదివాసీ ద్రోహి, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చింతపల్లి పర్యటన ఎవరి కోసమని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌ ప్రశ్నించారు. స్థానిక గిరిజన సంఘం భవన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి, ఎర్రవరం హైడ్రో పవర్‌ ప్రాజెక్టు అదానీకి కట్టబెట్టి, జీవో నంబరు- 3ని తుంగలోకి తొక్కి ఆదివాసీలకు శతశాతం ఉద్యోగాలు లేకుండా చేసిన ఘనుడు జగన్మోహన్‌రెడ్డి చింతపల్లి పర్యటన ఎందుకు చేపడుతున్నారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ చింతపల్లి సభకు వచ్చే ముందే గిరిజన యువతకు డీఎస్సీ ప్రకటించాలని, హైడ్రో పవర్‌ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేస్తున్నట్టు, బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలుపుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తానని, జీవో నంబరు 3కి చట్టబద్ధత కల్పిస్తానని ప్రకటించి అప్పుడు మన్యంలో పర్యటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Dec 19 , 2023 | 12:48 AM