చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు

ABN , First Publish Date - 2023-06-02T01:05:01+05:30 IST

చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ ధీరజ్‌ స్పష్టం చేశారు.

చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు
స్టేషన్‌ పరిధిలో పట్టుబడిన సారాయిని పరిశీలిస్తున్న ఏఎస్పీ ధీరజ్‌

హుకుంపేట పోలీస్‌ స్టేషన్‌ సందర్శన

సారా, గంజాయి నిర్మూలనకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆదేశం

హుకుంపేట, జూన్‌ 1 : చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఏఎస్పీ ధీరజ్‌ స్పష్టం చేశారు. హుకుంపేట పోలీస్‌ స్టేషన్‌ను గురువారం ఆయన తొలిసారిగా సందర్శించారు. రికార్డులను పరిశీలించి, కేసుల వివరాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా తయారీ, గంజాయి సాగుకు అంతా దూరంగా ఉండాలన్నారు. ఇందుకోసం గ్రామాలను సందర్శించి అక్కడి వారికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇటువంటి వాటికి దూరంగా ఉండి కాఫీ, మిరియాలు, పసుపు, పండ్ల తోటలు సాగుచేసుకుంటే మంచి ఆదాయంతో పాటు సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. మండలంలో ఈ ఏడాది పదహారు కేసుల్లో 337 లీటర్ల సారా పట్టుబడిన నేపథ్యంలో సారాను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు మరింత కృషి చేయాలని సీఐ సుధాకర్‌, ఎస్‌ఐ సతీష్‌లకు సూచించారు. అనంతరం సారాను పూడ్చిపెట్టించారు. శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Updated Date - 2023-06-02T01:05:01+05:30 IST