వివాహితపై యాసిడ్ దాడి
ABN , First Publish Date - 2023-12-11T00:23:06+05:30 IST
వివాహితపై యాసిడ్ దాడి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగానే యాసిడ్ దాడి జరిగినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు శనివారం రాత్రి ఫిర్యాదు చేయగా, ఆదివారం కేసు నమోదు చేసినట్టు సీఐ మరిడాన శ్రీనివాసరావు తెలిపారు.
నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
పెందుర్తి, డిసెంబరు 10: వివాహితపై యాసిడ్ దాడి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగానే యాసిడ్ దాడి జరిగినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలు శనివారం రాత్రి ఫిర్యాదు చేయగా, ఆదివారం కేసు నమోదు చేసినట్టు సీఐ మరిడాన శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని చింతగట్ల పంచాయతీ పరిధి నందవరపువానిపాలేనికి చెందిన సీహెచ్ నరసింగరావు ఆటోడ్రైవర్. ఆయనకు వివాహమై 18 ఏళ్లు కాగా భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కాగా ఇదే గ్రామానికి చెంది గోపాలపట్నంలో చికెన్ షాపు నిర్వహిస్తున్న శ్రీను భార్య పెదిరెడ్ల శిరీషతో కొంతకాలంగా ఆయన సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలో అక్రమ సంబంఽధానికి దారితీసింది. ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడంతో ఈ నెల ఏడున శిరీష ఇంటికి నరసింగరావు వెళ్లాడు. ఆ సమయంలో వివాదం జరగడంతో ఆమెపై నరసింగరావు దాడికి పాల్పడ్డాడు. అయితే నరసింగరావు తనపై అత్యాచారం, హత్యాయత్నానికి యత్నించడంతో పాటు యాసిడ్‌తో దాడి చేసి కొంత నగదు, బంగారం వస్తువులు తస్కరించి గోడ దూకి పారిపోయాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసినట్టు సీఐ తెలిపారు. యాసిడ్ దాడితో శిరీష గగ్గోలు పెట్టడంతో బంధువులు ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రితో చేర్పించారన్నారు. ప్రస్తుతం ఆమె కెజీహెచ్‌లో చికిత్స పొందుతుందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా అక్రమ సంబంధం నేపథ్యంలో కుటుంబంలో కలతలు తలెత్తడంతో శిరీష పురుగులు మందు తాగి తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని నరసింగరావు భార్య చిన్ని ఆరోపించింది.