రోడ్డుపై గోతులతో ప్రమాదాలు
ABN , First Publish Date - 2023-03-28T00:58:52+05:30 IST
అచ్యుతాపురం- అనకాపల్లి రోడ్డు మొత్తం గోతులు ఏర్పడి అధ్వానంగా తయారైందని, ఆర్‌అండ్‌బీ అధికారులు తక్షణమే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, సీపీఎం నాయకులు సోమవారం మునగపాకలో రాస్తారోకో చేశారు.
మరమ్మతులు చేపట్టాలని టీడీపీ, సీపీఎం డిమాండ్
ముగనపాకలో రాస్తారోకో
మునగపాక, మార్చి 27: అచ్యుతాపురం- అనకాపల్లి రోడ్డు మొత్తం గోతులు ఏర్పడి అధ్వానంగా తయారైందని, ఆర్‌అండ్‌బీ అధికారులు తక్షణమే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ, సీపీఎం నాయకులు సోమవారం మునగపాకలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, వేలాదిమంది ప్రయాణిస్తుంటారని, విస్తరణ పేరుతో మూడున్నరేళ్ల నుంచి నిర్వహణ పనులు చేయడంలేదని ఆరోపించారు. భారీ గోతులతోపాటు రహదారి ఇరుకుగా వుండడంతో వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోకపోవడంతో శోచనీయమని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి గోతులు పూడ్చకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాడి ముసిలినాయుడు, దాడి శివ, మొల్లేటి సత్యనారాయణ, వెలగా మురళీ, సీపీఎం నాయకులు బ్రహ్మాజీ, ఆడారి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.