అర్హులందరికీ నేతన్న నేస్తం
ABN , First Publish Date - 2023-06-26T00:11:27+05:30 IST
జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం సాయం అందజేస్తామని జౌళి శాఖ ఏడీ మురళీకృష్ణ తెలిపారు.
ఏడీ మురళీకృష్ణ
నక్కపల్లి, జూన్ 25 : జిల్లాలో అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం సాయం అందజేస్తామని జౌళి శాఖ ఏడీ మురళీకృష్ణ తెలిపారు. ఆదివారం నక్కపల్లిలో నేతన్న నేస్తం పథకం కింద దరఖాస్తు చేసుకున్న మగ్గాలను ఏడీ మురళీకృష్ణ, డీఓ రమణమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీ మాట్లాడుతూ.. గతేడాది జిల్లాలో 250 మగ్గాలకు అర్హత కలిగిందని, ఈ ఏడాది 270 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిలో 20 వరకు అనర్హత కలిగినవిగా గుర్తించామన్నారు. అర్హులందరికీ రూ.24వేలు చొప్పున సీఎం జగన్మోహన్‌రెడ్డి త్వరలో బ్యాంకు ఖాతాలను జమచేస్తారని ఆయన తెలిపారు. ఆయన వెంట వార్డు సభ్యులు బంగార్రాజు, సొసైటీ ఇన్‌చార్జి నాగబాబు ఉన్నారు.