ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ అద్భుతం

ABN , First Publish Date - 2023-03-31T01:12:40+05:30 IST

ముడసర్లోవ రిజర్వాయరులో నిర్మించిన ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ అద్భుతంగా ఉందని జి-20 సదస్సుకు విశాఖ వచ్చిన విదేశీ ప్రతినిధుల బృందం ప్రశంసించింది.

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ అద్భుతం
ముడసర్లోవ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌లో విదేశీ ప్రతినిధులు

ఆరిలోవ, మార్చి 30: ముడసర్లోవ రిజర్వాయరులో నిర్మించిన ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ అద్భుతంగా ఉందని జి-20 సదస్సుకు విశాఖ వచ్చిన విదేశీ ప్రతినిధుల బృందం ప్రశంసించింది. గురువారం మధ్యాహ్నం ఈ బృందం ప్లాంట్‌ను సందర్శించింది. నగరంనుంచి ప్రత్యేక బస్సులో పోలీసు బందోబస్తు మధ్య ఇక్కడికి వచ్చిన బృందం ప్లాంట్‌ను పూర్తిగా పరిశీలించింది. ప్లాంట్‌ పనితీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంత విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, ఎవరికి విక్రయిస్తున్నారు తదితర అంశాలను తెలుసుకున్నారు. విశాఖ నగరానికి ఈ ప్లాంట్‌ తలమానికంగా నిలుస్తుందని వారు అన్నారని అక్కడి అధికారులు తెలిపారు. కాగా విదేశీయుల పర్యటన సమయంలో పోలీసులు ఎవరినీ ప్లాంట్‌ వద్దకు అనుమతించలేదు.

Updated Date - 2023-03-31T01:12:40+05:30 IST