Share News

రాళ్లగెడ్డలో మహిళ మృత దేహం

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:33 AM

స్థానిక రాళ్లగెడ్డలో ఓ మహిళ మృతదేహాన్ని ఆదివారం మఽఽధ్యాహ్నం స్థానికులు గుర్తించారు. ఆమె పాడేరుకు చెందిన ఎం.దేవిగా నిర్ధారించుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. స్థానిక బక్కలపనుకు వీధికి చెందిన మహరాన రవి భార్య దేవి(37) ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

రాళ్లగెడ్డలో మహిళ మృత దేహం
ఎం.దేవి(ఫైల్‌ ఫొటో)

- మృతురాలు పాడేరుకు చెందిన దేవిగా గుర్తింపు

హుకుంపేట, డిసెంబరు 17: స్థానిక రాళ్లగెడ్డలో ఓ మహిళ మృతదేహాన్ని ఆదివారం మఽఽధ్యాహ్నం స్థానికులు గుర్తించారు. ఆమె పాడేరుకు చెందిన ఎం.దేవిగా నిర్ధారించుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. స్థానిక బక్కలపనుకు వీధికి చెందిన మహరాన రవి భార్య దేవి(37) ఈ నెల ఏడో తేదీ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తరువాత తిరిగి ఇంటికి రాలేదు. ఆమె కోసం పాడేరు పట్టణంలోని వీధుల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదని భర్త రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మృతదేహాన్ని స్థానిక రాళ్లగెడ్డలో స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు దేవి మృతదేహాన్ని గెడ్డలోంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

మతిస్థిమితం లేకపోవడమే కారణం

మృతురాలు దేవికి గత కొన్నాళ్లుగా మతిస్థిమితం బాగాలేని కారణంగా ఈ నెల ఏడో తేదీన ఇంట్లోంచి వెళ్లిపోయిందని ఆమె కుటుంబీకులు తెలిపారు. కుటుంబానికి తాను భారం కాకూడదనే కారణంతోనే ఆమె గెడ్డలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. రాళ్లగెడ్డలో ఆమె మృతదేహం గుర్తించిన కుటుంబీకులు విలపించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Updated Date - Dec 18 , 2023 | 12:33 AM