ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

ABN , First Publish Date - 2023-04-03T23:44:22+05:30 IST

ఆగి ఉన్న లారీని ఓ బస్సు ఢీకొంది. ఆ బస్సును వెనుకే వస్తున్న మరో బస్సు ఢీకొన్న ఘటన జాతీయ రహదారిలోని ఉమ్మలాడ జంక్షన్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసు కుంది.

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు
దెబ్బతిన్న బస్సు ముందు భాగం

ఆ బస్సును వెనుక నుంచి మరో బస్సు ఢీ

రెండు బస్సుల ముందు భాగాలు ధ్వంసం

సురక్షితంగా బయట పడిన ప్రయాణికులు

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 3: ఆగి ఉన్న లారీని ఓ బస్సు ఢీకొంది. ఆ బస్సును వెనుకే వస్తున్న మరో బస్సు ఢీకొన్న ఘటన జాతీయ రహదారిలోని ఉమ్మలాడ జంక్షన్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున చోటుచేసు కుంది. అయితే బస్సుల ముందు భాగాలు ధ్వంసమయ్యాయే తప్ప ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ట్రాఫిక్‌ సీఐ టి.శ్రీను తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి అరకులోయ సందర్శనకు రెండు ప్రైవేటు బస్సుల్లో 88 మంది ప్రయాణికులు ఆదివారం రాత్రి పది గంటలకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బస్సులు జాతీయ రహదారిలోని ఉమ్మలాడ జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి ముందు వెళుతున్న టిప్పర్‌ లారీ డ్రైవర్‌ అకస్మాత్తుగా నిలపడంతో వెనుక నుంచి వస్తున్న బస్సు దానిని బలంగా ఢీకొంది. ఆ వెనుకే వస్తున్న మరో బస్సు ముందు బస్సును డీకొంది. ఈ సంఘటనలో రెండు బస్సుల ముందు భాగాలు దెబ్బతిన్నాయి. వీటిలో ఒక బస్సుకు సాంకేతిక లోపం ఏర్పడి రోడ్డు మధ్యలో ఉండిపోవడంతో క్రేన్‌ సహాయంతో రోడ్డు పక్కకు తీయించారు. ఈ ప్రమాదం వల్ల ప్రయాణికులు ఎక్కువ సేపు రోడ్డు పక్కన వేచి ఉండాల్సి వచ్చింది. డ్రైవర్లు ఈ విషయాన్ని బస్సు యజమానులకు తెలియజేయడంతో కొద్దిసేపటికే మరో బస్సులను తీసుకువచ్చి ప్రయాణికులను అరకులోయ పంపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Updated Date - 2023-04-03T23:44:22+05:30 IST