Share News

9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:57 AM

మండలంలోని తాళ్లవలస సమీపంలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అలుమూరి శశికిరణ్‌ (14) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆదివారం భీమిలి పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.

9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

భీమునిపట్నం (రూరల్‌) డిసెంబరు 17: మండలంలోని తాళ్లవలస సమీపంలో ఉన్న నారాయణ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అలుమూరి శశికిరణ్‌ (14) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఆదివారం భీమిలి పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా చోడేపల్లి గ్రామానికి చెందిన శశికిరణ్‌ హాస్టల్‌లో ఉంటూ నారాయణ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు శశికిరణ్‌ తండ్రి గణేశ్‌ విశాఖ నగరంలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. శనివారం రాత్రి కళాశాల ప్రిన్సిపాల్‌ గణేశ్‌కు ఫోన్‌ చేసి శశికిరణ్‌ హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, సంగివలస ఆస్పత్రితో మృతదేహం ఉన్నట్టు సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. దీంతో ఆయన ఆస్పత్రికి చేరుకున్నాక ఈ ఘటనపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ హరీశ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శశికిరణ్‌ ఆత్మహత్య పాల్పడేందుకు గల కారణాలపై విచారణ సాగిస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Updated Date - Dec 18 , 2023 | 12:57 AM