Share News

90 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2023-12-03T00:44:05+05:30 IST

ఇక్కడి లక్ష్మీపురం వద్దనున్న రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారంతో పెందుర్తి పోలీసులు తనిఖీలు నిర్వహించి 90 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సీఐ మరిడాన శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

90 కిలోల గంజాయి పట్టివేత

పెందుర్తి, డిసంబరు 2: ఇక్కడి లక్ష్మీపురం వద్దనున్న రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి సమీపంలో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారంతో పెందుర్తి పోలీసులు తనిఖీలు నిర్వహించి 90 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం సీఐ మరిడాన శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన ప్రమోద్‌ అనే వ్యక్తి కొంతమందితో కలిసి గంజాయిని వాహనంలో తెచ్చి ఇక్కడి బ్రిడ్జి కింద దాచిపెట్టారు. గంజాయిని నగరంలోకి తరలించేందుకు వేరే వాహనం తెచ్చేందుకు తనతో పాటు వచ్చిన వ్యక్తులు వెళ్లగా ప్రమోద్‌ కాపలాగా ఉన్నాడు. పోలీసులు దాడి చేసి బ్రిడ్జి కింద పైపుల్లో దాచిపెట్టిన గంజాయిని స్వాధీనం చేసుకుని ప్రమోద్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-12-03T00:44:09+05:30 IST