ఉపాధ్యాయ బదిలీలకు 6,000 దరఖాస్తులు
ABN , First Publish Date - 2023-05-27T00:48:06+05:30 IST
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు శుక్రవారం సాయంత్రం వరకూ ఆన్‌లైన్‌లో ఆరు వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు విద్యాశాఖాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి.

అర్ధరాత్రి వరకూ గడువు ఉన్నందునఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం
భీమునిపట్నం రూరల్, మే 26:
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు శుక్రవారం సాయంత్రం వరకూ ఆన్‌లైన్‌లో ఆరు వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు విద్యాశాఖాధికారి కార్యాలయ వర్గాలు తెలిపాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకూ గడువు ఉన్నందున...ఈ సంఖ్య మరికొంత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తమకు అందిన దరఖాస్తులను ప్రధానోపాధ్యాయులు, ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు...ఇలా కేటగిరీ వారీగా వేరు చేయవలసి ఉందన్నారు. కాగా ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంటు పోస్టులు 145 ఖాళీ ఉండగా...తయారుచేసిన జాబితాలో అత్యధికులు అన్‌విల్లింగ్ ఇచ్చారు. సైన్స్ పోస్టులు 43 ఖాళీ ఉండగా...వాటికి సరిపడా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. కాగా గ్రేడ్-2 హెచ్‌ఎం పోస్టులు 13 ఉండగా ఇప్పటివరకూ పది దరఖాస్తులు మాత్రమే రావడంతో శనివారం వరకు గడువు పొడిగించారు.