6 శాఖలు.. 18 రంగాలు.. 13 లక్షల కోట్లు పెట్టుబడులు

ABN , First Publish Date - 2023-03-05T03:01:15+05:30 IST

విశాఖపట్నంలో రెండు రోజులపాటు నిర్వహించిన సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

6 శాఖలు.. 18 రంగాలు..  13 లక్షల కోట్లు పెట్టుబడులు

8378 ఎంవోయూలు.. 6లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు

8గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ వివరాలను ప్రకటించిన ప్రభుత్వం

విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో రెండు రోజులపాటు నిర్వహించిన సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చినట్టు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. ఆరు ప్రభుత్వ శాఖల పరిధిలోని 18 రంగాల్లో రూ.13,41,734కోట్ల విలువైన 378ఎంవోయూలు జరిగినట్టు వెల్లడించారు. వీటి ద్వారా 6,09,868 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నట్టు పేర్కొన్నారు. మొదటిరోజు రూ.11.85 లక్షల కోట్ల విలువజేసే 92 ఎంవోయూలు, రెండోరోజైన శనివారం రూ.1.56 లక్షల కోట్లు విలువజేసే 286 ఎంవోయూలు జరిగినట్టు వివరించారు.

Updated Date - 2023-03-05T03:01:15+05:30 IST