280 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2023-08-22T23:59:29+05:30 IST

అనకాపల్లి పట్టణ పోలీసులు 280 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి పట్టణ సీఐ దాడి మోహనరావు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.

280 కిలోల గంజాయి స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి మూటలు

ఒకరి అరెస్టు, కారు సీజ్‌

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 22: అనకాపల్లి పట్టణ పోలీసులు 280 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని హైదరాబాద్‌ కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి పట్టణ సీఐ దాడి మోహనరావు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి పట్టణ ఎస్‌ఐ సింహాచలం, సిబ్బంది కలిసి మంగళవారం మధ్యాహ్నం జాతీయ రహదారిపై కొత్తూరు జంక్షన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. కొద్దిసేపటి తరువాత తాళ్లపాలెం వైపు నుంచి అనకాపల్లి వస్తున్న స్విఫ్ట్‌ డిజైర్‌ కారును ఆపి సోదాలు చేశారు. డిక్కీలో గోనె సంచుల మూటలు కనిపించడంతో విప్పి చూడగా గంజాయి కనిపించింది. డ్రైవర్‌ను, గంజాయిని వాహనంతో సహా స్టేషన్‌కు తరలించారు. గంజాయి మూటలను తూకం వేసి 280 కిలోలు వున్నట్టు నిర్ధారించారు. కారు డైవర్‌ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన తూము బాలిరెడ్డిని అరెస్టు చేశారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన కారును సీజ్‌ చేశారు. గంజాయి రవాణా వెనుక ఎవరెవరి హస్తం వుందో మరింత లోతగా విచారణ జరుపుతామని సీఐ తెలిపారు.

Updated Date - 2023-08-22T23:59:29+05:30 IST