Tiger: నంద్యాల జిల్లాలో పెద్దపులి సంచారం

ABN , First Publish Date - 2023-04-13T21:45:05+05:30 IST

నంద్యాల జిల్లా (Nandyala district) రుద్రవరం గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మామిడి తోటల్లో గురువారం తెల్లవారుజామున పెద్దపులి

Tiger: నంద్యాల జిల్లాలో పెద్దపులి సంచారం

రుద్రవరం: నంద్యాల జిల్లా (Nandyala district) రుద్రవరం గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో మామిడి తోటల్లో గురువారం తెల్లవారుజామున పెద్దపులి (Tiger) సంచరించింది. రైతులు సమాచారాన్ని ఫారెస్టు అధికారులకు తెలియజేశారు. మామిడి తోటల్లో సంచరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మకొండ హుసేనయ్యస్వామి దర్గా సమీపంలో తోటల్లో ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసరు నాగరాజు, బీట్‌ ఆఫీసర్లు నరసింహారెడ్డి, సురేంద్రగౌడ్‌ పులి పాదముద్రలను గుర్తించారు. పెద్దపులి దాడిలో కుక్కపిల్ల కూడా మృతి చెందింది. రేంజర్‌ శ్రీపతినాయుడు మాట్లాడుతూ పెద్దపులి సంచార విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

Updated Date - 2023-04-13T21:45:10+05:30 IST