టమాటా తోట దోచేశారు!

ABN, First Publish Date - 2023-08-05T03:46:36+05:30 IST

టమాటా ధరలు పెరుగుతుండటంతో వాటికీ దొంగల బెడద తప్పడం లేదు. కర్ణాటక వంటి రాష్ర్టాల్లో టమాటా లారీలను హైజాక్‌ చేసిన ఘటనలు చోటుచేసుకోగా..

రూ.90 వేల విలువైన టమాటాల చోరీ

ధర్మవరం రూరల్‌, ఆగస్టు 4: టమాటా ధరలు పెరుగుతుండటంతో వాటికీ దొంగల బెడద తప్పడం లేదు. కర్ణాటక వంటి రాష్ర్టాల్లో టమాటా లారీలను హైజాక్‌ చేసిన ఘటనలు చోటుచేసుకోగా.. తాజాగా, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండల పరిధిలోని కేఎన్‌ పాళ్యం సమీపంలోని ఓ తోటలోని టమాటాలను దొంగలు కోసుకుపోయారు. గ్రామానికి చెందిన రైతు రామాంజి 2ఎకరాల్లో టమాటా సాగు చేశాడు. శుక్రవారం ఉదయం తోటకు వెళ్లి చూసేసరికి కోతకొచ్చిన టమాటాలు కనిపించలేదు. సుమారు రూ.90వేల విలువజేసే (30 బాక్సులు) టమాటాలను దొంగలు కోసుకుపోయారని బాధితుడు వాపోయాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated at - 2023-08-05T03:46:36+05:30