Share News

AP NEWS: కడప జిల్లాలోని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2023-11-21T14:58:04+05:30 IST

కడప జిల్లాలోని మైలవరం మండల పరిధిలో ఉన్న దాల్మియా సిమెంట్ ( Dalmia Cement ) ఫ్యాక్టరీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

AP NEWS: కడప జిల్లాలోని దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్రిక్తత

కడప: కడప జిల్లాలోని మైలవరం మండల పరిధిలో ఉన్న దాల్మియా సిమెంట్ ( Dalmia Cement ) ఫ్యాక్టరీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఫ్యాక్టరీ సమీపంలోని నవాబుపేట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నాపరాయి కోసం మోతాదుకు మించి బ్లాస్టింగ్ చేయడం వల్ల తమ ఇళ్లు నెర్రలుచీలి దెబ్బ తింటున్నాయని, పంటపొలాలు పాడవుతున్నాయని నవాబుపేట ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సిమెంట్ ప్లాంట్ గేటు మూసి వేసి విధులు జరగకుండా ఆందోళన కారులు అడ్డుకున్నారు. దీంతో నవాబుపేట గ్రామస్తులకు పరిశ్రమ సిబ్బందికి ఇరువురి మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో దాల్మియా సిమెంట్స్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగింది.

Updated Date - 2023-11-21T15:15:21+05:30 IST