Share News

Achanta Sunitha: అది చేతకానప్పుడు తెలంగాణ కంటే ఎక్కువిస్తామని ఎందుకు చెప్పారు?

ABN , Publish Date - Dec 30 , 2023 | 03:22 PM

Andhrapradesh: అంగన్వాడీల జీతాల పెంపుపై మంత్రి బొత్స వ్యాఖ్యలు దుర్మార్గమని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జీతాలు పెంచడం

Achanta Sunitha:  అది చేతకానప్పుడు తెలంగాణ కంటే ఎక్కువిస్తామని ఎందుకు చెప్పారు?

అమరావతి: అంగన్వాడీల జీతాల పెంపుపై మంత్రి బొత్స వ్యాఖ్యలు దుర్మార్గమని తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జీతాలు పెంచడం చేతకానప్పుడు తెలంగాణ కంటే ఎక్కువిస్తామని ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. కేవలం రూ. వెయ్యి పెంచి అంగన్వాడీల జీవితాలను ఉద్దరించినట్టు మాట్లాడతారా? అంటూ మండిపడ్డారు. అంగన్వాడీలపై జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఆచంట సునీత హామీ ఇచ్చారు.

Updated Date - Dec 30 , 2023 | 03:22 PM