Kotamreddy అలా.. మాజీ హోంమంత్రి సుచరిత ఇలా..

ABN , First Publish Date - 2023-02-02T12:30:07+05:30 IST

వైసీపీలో ఇప్పుడిప్పుడే అసంతృప్త స్వరాలు బయటకు వినవస్తున్నాయి. మాజీ హోం మంత్రి సుచరిత గతంలోనే పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. ఇక నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై డైరెక్ట్ అటాక్ చేశారు.

Kotamreddy అలా..  మాజీ హోంమంత్రి సుచరిత ఇలా..

గుంటూరు : వైసీపీ (YCP)లో ఇప్పుడిప్పుడే అసంతృప్త స్వరాలు బయటకు వినవస్తున్నాయి. మాజీ హోం మంత్రి సుచరిత (Sucharitha) గతంలోనే పరోక్షంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. ఇక నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ప్రభుత్వంపై డైరెక్ట్ అటాక్ చేశారు. తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని.. ఆధారాలతో సహా బయట పెట్టారు. నిన్నటి నుంచి కోటంరెడ్డి వర్సెస్ వైసీపీ కీలక నేతల (YCP Leaders) వార్ నడుస్తూనే ఉంది.

ఈ వార్ నేపథ్యంలో తాజాగా సుచరిత లైవ్‌లోకి వచ్చారు. రావడమే కాదు.. ఆమె వైసీపీకి సానుకూలంగా మాట్లాడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సుచరిత పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఇటీవలి కాలంలో బీభత్సంగా జరిగింది. ఆ ప్రచారాన్ని సైతం కొట్టేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. సోషల్ మీడియా (Social Media)లో తప్పుడు కథనాలను బేస్ చేసుకుని మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం తాను పార్టీ మారబోతున్నట్టు కథనాలను వెలువరిస్తోందని విమర్శించారు.

పార్టీ మారే ఉద్దేశం లేదు..

‘‘సోషల్ మీడియా వేదికగా నాపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఆ వార్తలను బేస్ చేసుకుని శాటిలైట్ ఛానల్స్ లో పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2019లో నన్ను అభ్యర్థిగా నిలబెట్టిన నాయకుడు జగన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి హోం మంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు. పార్టీ మారటం అంటే నేను ఇంటికే పరిమితమవుతాను. గడప గడపకు కార్యక్రమంతో ప్రతి ఇంటికి లబ్ది చేకూరింది. ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్నారు. దళితుల్లో పుట్టటం నా అదృష్టంగా భావిస్తున్నా. అర్హత ఉన్న అందరికీ అన్ని పథకాలు అందిస్తున్న పార్టీ వైసీపీ. నాపై చిలవలు పలవలు రాయవద్దు. నేను రాజకీయాలలో ఉన్నంతకాలం వైసీపీ‌తోనే ఉంటాను’’ అని సుచరిత పేర్కొన్నారు.

Updated Date - 2023-02-02T12:30:10+05:30 IST