TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల తేదీలివే

ABN , First Publish Date - 2023-06-16T21:48:23+05:30 IST

శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేపట్టింది. సుప్రభాతం, తోమాల

TTD: శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల తేదీలివే

తిరుమల: శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేపట్టింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జితసేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్‌లో ఎంపికైన భక్తులు టికెట్‌ ధరను ఆన్‌లైన్‌లోనే చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 22వ తేదీన ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకారసేవా టికెట్ల కోటా విడుదల చేస్తారు.22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకారసేవ వర్చువల్‌ సేవల కోటా, వాటికి సంబంధించిన దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేయనున్నారు. ఆంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23వ తేదీన ఉదయం 10 గంటలకు జారీ చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జరగనున్న పవిత్రోత్సవాల టికెట్లను 22వ తేదీన విడుదల చేస్తారు.

శ్రీవారి సేవలో న్యాయమూర్తులు

తిరుమల వేంకటేశ్వరస్వామిని శుక్రవారం పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి, న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిలహరి వేకువజామున ఆలయంలో జరిగిన అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో మరోసారి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహద్వారం వద్ద జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు, జస్టిస్‌ శేషసాయికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.

Updated Date - 2023-06-16T21:48:23+05:30 IST