Srisailam: శ్రీశైల దేవస్థానంలో మొదటి, చివరి మాట ఆయనదే.. ఇంతకీ ఏం చేస్తున్నారంటే..!

ABN , First Publish Date - 2023-02-26T19:15:31+05:30 IST

శ్రీశైల దేవస్థానం (Srishaila Devasthanam)లో భక్తులకు వసతి, దర్శనం వంటి విభాగాల్లో ఆయనదే మొదటి, చివరి మాట. తనకు అనుకూలమైన వారు వస్తే...

Srisailam: శ్రీశైల దేవస్థానంలో మొదటి, చివరి మాట ఆయనదే.. ఇంతకీ ఏం చేస్తున్నారంటే..!

శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం (Srishaila Devasthanam)లో భక్తులకు వసతి, దర్శనం వంటి విభాగాల్లో ఆయనదే మొదటి, చివరి మాట. తనకు అనుకూలమైన వారు వస్తే అన్నీ క్షణాల్లో జరిగిపోవాల్సిందే. తన పేరు చెబితే చాలు క్షేత్రానికి వచ్చిన వారికి ఎవరూ ఎలాంటి అడ్డు చెప్పకూడదు. అంతేకాకుండా దేవస్థాన సిబ్బందిని సొంత పనులకు ఉపయోగించుకుంటున్నాడు. ఇదీ శ్రీశైలం (Srisailam)లో ఏఈవో స్థాయి అధికారి తీరు. ఆయన వ్యవహారంలో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. గతంతో ఓ సారి సస్పెండ్ అయినా ఆయన తీరులో మార్పు లేదనే విమర్శలున్నాయి.

శ్రీశైలంలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి రూ. 200, రూ 500 టికెట్లతో శ్రీఘ్ర దర్శనాలు ఉంటాయి. ఇవి కాకుండా వీఐపీ (VIP) దర్శనలు కూడా ఉంటాయి. వీటన్నింటిని ఏఈవో స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. సదరు అధికారి విధుల్లో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. క్యూలైన్ల వద్దకు వెళ్లి తన పేరు చెబితే చాలు సిబ్బంది దర్శనానికి పంపాల్సిందే. ఇంతకూ ఆయనకు సంబంధించిన వారు ఎవరో? తెలియక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో దర్శనానికి వచ్చినవారు ఆయనకు ఫోన్ చేయండని సిబ్బంది సూచిస్తే ఇక వారికి మూడినట్లే. నా పేరు చెప్పినా పంపించారా? అంటూ చిందులు తొక్కుతాడు. అంతటితో ఆగకుండా తనకు ఫోన్ చేయించిన సిబ్బందిని తాత్కాలికంగా రెండు, మూడు రోజుల పాటు విధుల నుంచి తొలగిస్తాడు. ఆయనకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు. దీంతో ఆయన ఆడిందే ఆట పాడిండే పాటగా సాగుతోంది.

ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ..

మల్లన్న దర్శనానికి ప్రతి రోజు కొన్ని వీఐపీ టికెట్లు ఉంటాయి. ఈ టికెట్ల కేటాయింపు సంబంధిత ఉద్యోగి విచక్షణను బట్టి ఉంటుంది. ఈ విషయంలో ఆ అధికారి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. టికెట్ కౌంటర్ ఉద్యోగితో దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. తన మాట వినని టికెట్ కౌంటర్ ఉద్యోగిని వేరే చోటికి బదిలీ కూడా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీఐపీల సంబంధీకులు వచ్చినప్పుడు ప్రొటోకాల్ (protocol) ఉల్లంఘించి దర్శనాలు, పూజలు చేయించి మెప్పుపొందే ప్రయత్నాలు చేస్తాడాన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవల పాలకమండలి సభ్యుల అభిషేకం టికెట్ల దుర్వినియోగం బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ అధికారి ప్రొటోకాల్ ఉల్లంఘనలు దేవస్థాన అధికారుల దృష్టికి రావడం లేదా? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది.

సపర్యలు చేయాల్సిందే..

ఏజెన్సీ (Agency) ద్వారా పనిచేసే సిబ్బంది దేవస్థానం విధులు మాత్రమే నిర్వహించాలి. కానీ ఈ అధికారి వారితో సొంత పనుల చేయించుకుంటున్నాడు. ప్రతిరోజు ఇద్దరు లేదా ముగ్గురు సిబ్బంది ఆయన ఇంటి పని చేయాల్సిందే. కుటుంబసభ్యులు కూడా పెత్తనం చెలాయిస్తారని ఆయన ఇంటికి వెళ్లాలంటే సిబ్బంది కూడా భయపడుతున్నారు. ఆయన చెప్పినట్లు వినకపోతే జీతాలను నిలిపేస్తాడని ఉద్యోగం నుంచి తొలగిస్తారని ఆందోళన చెందుతున్నారు.

అక్కడే ఎందుకు

ఆ అధికారి శ్రీశైల దేవస్థానం ప్రస్తుతం స్థానిక గంగాసదన్‌లో వసతి కల్పిచింది. గతంలో ఈ వసతి గృహంలోనే ఆయన సిషిద్ధ పదార్థాల వంటకాలకు తయారు చేశారు. అయినా తిరిగి మళ్లీ అదే విభాగానికి ఎందుకు నియమించారనే ప్రశ్న వినిపిస్తోంది. తన అధికారాలను ఉపయోగించుకుని గతంతో జరిగిన అవకతవకలను సరిదిద్దుకునే అవకాశం ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేవస్థానం ఉన్నతాధికారితో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఈ అధికారి ఇలా చేస్తున్నాడనే ఆరోపణలున్నాయి.

ఆది నుంచీ..

ఆ అధికారి తీరు మొదటి నుంచి ఇలాగే ఉంది. గతంలో దేవస్థానం పరిధిలో అన్యమత ప్రార్థనలు నిర్వహించడమే కాకుండా.. నిషిద్ద వంటకాల తయారీ కూడా చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దీంతో అధికారులు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఇదే విషయంలో అప్పటి దేవస్థానం ఈవో ఈ అధికారిని సస్పెండ్ చేశారు. పెట్రోల్ బంకుకు సంబంధించిన అవకతవకల్లో కూడా ఆ అధికారి హస్తం ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇంత జరిగినా ఆయన పనితీరులో ఏమాత్రం మార్పు రాలేదనే విమర్శలున్నాయి.

Updated Date - 2023-02-26T19:24:22+05:30 IST