ఎవరా అధికారి?
ABN , First Publish Date - 2023-11-21T23:58:40+05:30 IST
జిల్లాలో ఎక్సైజ్ అధికారి వసూళ్ల పర్వం హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘ఉద్యోగం ఉండాలా..రూ.60వేలు ఇవ్వు’ కథనం జిల్లా వ్యాప్తం గా చర్చనీయాంశమైంది. బాధితులు పదుల సంఖ్య లో కాదు.. వందల్లో ఉన్నట్టు చర్చ నడు స్తోంది. ఒక్కొక్కరూ బయటకు వచ్చి స్థానిక ప్రజా ప్రతి నిధుల ఎదుట మొర పెట్టుకున్నట్టు సమాచారం. ఈ కథనంపై సీనియర్ మంత్రి స్పందించినట్లు భోగట్టా. ఇప్పటికే సదరు అధికారిపై మంత్రికి ఫిర్యా దులు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ‘ఆంధ్రజ్యోతి’ లో కథనం రావడంతో ఆయన సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలిసింది.

ఆరా తీస్తున్న ఎస్బీ పోలీసులు
ఎక్సైజ్ శాఖలో వసూళ్ల పర్వంపై చర్చ
ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు
రణస్థలం, నవంబరు 21: జిల్లాలో ఎక్సైజ్ అధికారి వసూళ్ల పర్వం హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘ఉద్యోగం ఉండాలా..రూ.60వేలు ఇవ్వు’ కథనం జిల్లా వ్యాప్తం గా చర్చనీయాంశమైంది. బాధితులు పదుల సంఖ్య లో కాదు.. వందల్లో ఉన్నట్టు చర్చ నడు స్తోంది. ఒక్కొక్కరూ బయటకు వచ్చి స్థానిక ప్రజా ప్రతి నిధుల ఎదుట మొర పెట్టుకున్నట్టు సమాచారం. ఈ కథనంపై సీనియర్ మంత్రి స్పందించినట్లు భోగట్టా. ఇప్పటికే సదరు అధికారిపై మంత్రికి ఫిర్యా దులు వెల్లువెత్తాయి. ఈ తరుణంలో ‘ఆంధ్రజ్యోతి’ లో కథనం రావడంతో ఆయన సీరియస్‌గా దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఇటువంటి అధికారితో ప్రభు త్వానికి చెడ్డపేరు వస్తోందని, సమగ్ర దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి మంత్రి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే శాఖాపరమైన విచారణ ప్రారంభంమైనట్లు తెలు స్తోంది. ఎక్సైజ్‌శాఖలో డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారిని విచారణకు నియమించి నట్లు భోగట్టా. ఎన్నికల ముంగిట సదరు అధికారి నిర్వాకంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండడంతో అధికార పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. దీంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సైతం ఆరా తీస్తున్నట్టు సమాచారం. అయితే సదరు అధికారి విషయంలో బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్క ఉద్యోగులే కాదు.. ప్రభుత్వ మద్యం దుకాణా లతో పాటు కొత్తగా ఏర్పాటుచేసిన లిక్కర్ మాల్స్ నుంచి భారీగా వసూళ్లకు దిగినట్టు తెలుస్తోంది. రణస్థలం మండలం పైడిభీమవరంలో లిక్కర్ మాల్ అద్దెను రూ.70 వేలుగా నిర్ధారించారు. అక్కడ అద్దె ధర అంత స్థాయిలో లేదని.. ఆ మొత్తం చెల్లిం చాలంటే ఒక నెల అద్దె వదులు కోవాల్సిం దేనని సదరు అధికారి తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా అన్ని దుకాణాల నుంచి లక్షల రూపాయల కైంకర్యం జరుగుతున్నట్టు ప్రచా రం జరుగుతోంది. అయితే సిబ్బంది నుంచి వసూళ్ల పర్వాన్ని ఎక్సైజ్ శాఖ సీరియస్ తీసుకు న్నట్టు సమాచారం. అయితే, తప్పుచేసిన అధికారిని వదిలి.. సమాచారమిచ్చిన కొంతమంది సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీచేయడం విమర్శలకు తావి స్తోంది. మొత్తానికి ఎక్సైజ్‌శాఖ అవినీతి అధికారిపై ‘ఆంధ్ర జ్యోతి’ కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది.