అలుగు ఎక్కడ?

ABN , First Publish Date - 2023-03-20T00:09:17+05:30 IST

మండలంలోని సీహెచ్‌ కపాసుకుద్దిలో శనివారం రాత్రి అలుగు సంచరించడంతో కలకలం రేగింది. అయితే ఆదివారం అది మాయంకావడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.

అలుగు ఎక్కడ?
గ్రామస్థులకు పట్టుబడిన అలుగు

కవిటి: మండలంలోని సీహెచ్‌ కపాసుకుద్దిలో శనివారం రాత్రి అలుగు సంచరించడంతో కలకలం రేగింది. అయితే ఆదివారం అది మాయంకావడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని గ్రామస్థులు డిమాండ్‌ చే స్తున్నారు. అటవీశాఖ సెక్షన్‌ అధికారి రాఘవయ్య, బీట్‌ ఆఫీసర్‌ రవికుమార్‌ కథనం మేరకు... కపాసుకుద్ది గ్రామానికి చెందిన మైలుపిల్లి రుక్మిణమ్మ ఇంటి వద్దకు పొలుసుతో కూడిన వింత జంతువు శనివారం కనిపించింది. దీంతో ఆమె భయపడి ఇంటిలోపలికి వెళ్లి తలుపులు వేసుకొంది. అనంతరం గ్రామస్థులు గుల్ల ఉమాపతి, దుమ్ము రామయ్యతో చెప్పడంతో ఇంటి వద్దకు వచ్చి ఆ వింత జంతు వును వారు పరిశీలించారు. ఆ వింత జంతువును అలుగుగా గ్రామస్థులు నిర్ధారించారు. బడే తిరుపతి, కోడా దేవరాజ్‌, దుమ్ము నూకరాజులు ఆ జంతువును చూశారు. మన గ్రామదేవత తోటమ్మతల్లి స్వయంగా మీ ఇంటి వద్దకు ఈ వింత జంతువును రప్పించందని, ఈ రాత్రికి దాన్ని భద్రపరిచి తెల్లవారుజామున అందజేస్తామని వారు చెప్పి తీసుకువెళ్లారు. ఆదివారం ఉదయం రుక్మిణమ్మ వెళ్లి అడిగింది. ఎటో వెళ్లిపో యిందని బడే తిరుపతి, కోడా దేవరాజ్‌, దుమ్ము నూకరాజులు సమాధానం ఇ వ్వడంతో ఈ విషయం రుక్మిణమ్మ మిగిలిన గ్రామస్థులకు తెలియజేసింది. అయితే ఆలుగు తప్పిపోవడంపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని అటవీశాఖ అధికారులకు గ్రామస్థులు కోరారు. దీనిపై దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఫారెస్ట్‌ ఆఫీసర్‌ రాఘవయ్య ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - 2023-03-20T00:09:17+05:30 IST