కల్వర్టుకు మోక్షమెప్పుడో?

ABN , First Publish Date - 2023-03-31T00:01:04+05:30 IST

రిట్టపాడు గ్రామానికి సమీపంలో గల ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఉన్న కల్వర్టు శిఽథిలావస్థకు చేరుకుంది

కల్వర్టుకు మోక్షమెప్పుడో?
శిథిలావస్థకు చేరుకున్న రిట్టపాడు కల్వర్టు

- భయాందోళనలో వాహనచోదకులు

వజ్రపుకొత్తూరు: రిట్టపాడు గ్రామానికి సమీపంలో గల ఆర్‌అండ్‌బీ రోడ్డుపై ఉన్న కల్వర్టు శిఽథిలావస్థకు చేరుకుంది. భారీ వాహనాలు వెళ్తున్నప్పుడు కల్వర్టు కదులుతుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందోననే వాహనచోదకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కల్వర్టు నిర్మాణం కోసం గత ప్రభుత్వ ప్రభుత్వం నిధులు విడుదలైనా అంచనా వ్యయానికి తక్కువుగా ఉందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్‌ ముందుకు రాలేదు అప్పటి నుంచి అంచనా వ్యయం పెంచాలని కోరినా ఇంతవరకు ఆ ఊసే లేకుండా పోయింది. ఈ రోడ్డుపై భారీ వాహనాలతోపాటు కళాశాలల బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-31T00:01:04+05:30 IST