‘నిధులు వస్తే భూసేకరణ చేస్తాం’

ABN , First Publish Date - 2023-03-25T23:54:27+05:30 IST

కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని కొనుగోలు చేసేందుకు న్యూక్లీయర్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందని, ఈ నిధులు వస్తే భూసేక రణ చేస్తామని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మురళీకృష్ణ స్పష్టం చేశారు.

‘నిధులు వస్తే భూసేకరణ చేస్తాం’

రణస్థలం: కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని కొనుగోలు చేసేందుకు న్యూక్లీయర్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి నిధులు విడుదల కావాల్సి ఉందని, ఈ నిధులు వస్తే భూసేక రణ చేస్తామని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ మురళీకృష్ణ స్పష్టం చేశారు. శనివారం కొవ్వాడ గ్రామంలో మత్సకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అణువిద్యుత్‌ కేంద్రం కోసం భూములు ఇచ్చిన కొంతమంది రైతు లకు నష్టపరిహారం అందలేదని ఫిర్యాదులు వచ్చాయని, ఈ మేరకు పరిశీలన కు ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామ న్నారు. అదేవిధంగా రణస్థలంలో బీఎల్‌వోలతొ సమావేశం నిర్వహించారు. ప్రతి ఓటర్‌ కార్డుకు ఆధార్‌ అనుసంధానం చేయాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు పొందాలన్నారు.

Updated Date - 2023-03-25T23:54:27+05:30 IST