వైసీపీకి చరమగీతం పాడాలి
ABN , First Publish Date - 2023-09-20T00:12:30+05:30 IST
వైసీపీకి చరమగీతం పాడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా రిలేదీక్షలు కొనసాగాయి. దీక్షల్లో పార్టీ మహిళా నాయకులు కూర్చొని సంఘీభావం తెలిపారు చంద్రబాబు విడుదల కావాలని చర్చిలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పార్థనలు చేశారు.

వైసీపీకి చరమగీతం పాడాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా రిలేదీక్షలు కొనసాగాయి. దీక్షల్లో పార్టీ మహిళా నాయకులు కూర్చొని సంఘీభావం తెలిపారు చంద్రబాబు విడుదల కావాలని చర్చిలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పార్థనలు చేశారు.
సరుబుజ్జిలి: అరాచక పాలన సాగిస్తున్న ఫ్యాక్షన్ సీఎం సైకో జగన్‌కు ప్యాకప్ చెప్పాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికు మార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆమదాలవవలసలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, ఆమదాలవలస మండలాలతోపాటు ఆమదాలవలస మునిసిపా లిటీకి చెందిన తెలుగు మహిళలు చేపట్టిన నిరసన దీక్షలో రవికుమార్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్షకు జనసేన ఆమదాలవలస నియోజకవర్గ నాయకులు పేడాడ రామ్మోహన్ సంఘీ భావం తెలిపారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ ప్రసాద్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు మెండ దాసునాయుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ తమ్మినేని గీత, విద్యాసాగర్, మాజీ ఎంపీపీ కూన ప్రమీల, నాయకులు వండాన మురళి,నూకరాజు, శివ్వాల సూర్య నారాయణ, భాస్కరరావు, నందివాడ గోవిందరావు, కిల్లిసిద్దార్థ, మెట్ట సుజాత,చాపర విజయలక్ష్మి పాల్గొన్నా రు.ఫవినాయక చవితి పురస్కరించుకొని సోమవారం ఆమదాలవలసలోని టీడీపీ నిరసన శిబిరంలో మునిసిపల్ మాజీ చైర్మన్ తమ్మినేని గీతా విద్యాసా గర్ ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ప్రత్యేక హోమ గుండాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబునాయుడు కేసులు నుంచి విముక్తి పొందాలని పార్టీ జిల్లా అధ్య క్షుడు రవికుమార్, నాయకులు తమ్మినేని విద్యా సాగర్, దవల అప్పలనాయు డు, కూన నాగు, బొడ్డేపల్లి విజయకుమార్, సంపత్ రావు, మురళీరరావు పూజ లు చేపట్టారు. ఫ జి.సిగడాం: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బెయిల్‌పై విడుదల కావాలని మదుపాం సర్పంచ్ బోగాది అప్పలనాయుడు ఆధ్వర్యంలో సోమవారం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వినాయకుని మండపం వద్ద నినాదాలు చేశారు. ఫగార: చింతువలసలో చర్చిలో చంద్రబాబు జైలు నుంచి విడుదల కోసం టీడీపీ క్రిస్టియన్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, టీడీపీ ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి గోర సురేష్, క్రిస్టియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఈటెస్వామి దాసు, ప్రధాన కార్యదర్శి బోసుబాబు, క్రిస్టియన్ విభాగం ప్రధాన కార్యదర్శి జేసీ దేవదాస్, బిషప్ కృపానందం, పాస్టర్ చిన్నవాడు, అనీల్ రాజ్, మోషే, జాషువా, మోహనరావు, రామారావు, విజయకుమార్, దినేష్, యేసుబాబు, నాయకులు మాదారపు వెంకటేష్, రాధాకృష్ణ రెడ్డి, వెంకటరావు పాల్గొన్నారు.
ఎచ్చెర్లలో అర్ధనగ్న ప్రదర్శన
ఎచ్చెర్ల: ఎచ్చెర్లలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయం ఆవరణలో చంద్ర బాబు అరెస్ట్‌కు నిరసనగా తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళ వారం దీక్షలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు,టీడీపీ మండలాధ్యక్షుడు బెండు మల్లేశ్వర రావు,నేతలు వావిలపల్లి రామకృష్ణ, గాలి వెంకటరెడ్డి, అన్నెపు భువనే శ్వరరావు, పైడి అన్నంనాయుడు, మెండ రాజారావు, గూరు జగపతిబాబు, గట్టెం శివరామ్, గాడు రామారావు పాల్గొన్నారు.ఫ లావేరు/రణస్థలం: టీఎన్‌ఎస్ ఎఫ్ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు మజ్జి రామూర్తి ఆధ్వర్యంలో మంగళవారం గుమ్మడాం పంచాయతీ నుంచి 100 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు. ఎచ్చెర్ల నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో చేపట్టిన దీక్షకు మద్దతుగా లావేరు మం డలం గుమడాం నుంచి ఎచ్చెర్ల టీడీపీ కార్యాలయం వరకు జాతీయ రహదా రిపై 102 బైక్‌లతో చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ 150 మంది యువ కులు ర్యాలీ చేపట్టారు.ఫరణస్థలం: చంద్రబాబునాయుడుకు మంచి జరగాల ని మంగళవారం జమియా మసీద్‌లో ముస్లిములు ఉపవాస దీక్షలు ప్రారం భించారు. పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు అభ్యర్థన మేరకు ఆరుగురు ముస్లిములు 20 రోజులపాటు ఉపవాస దీక్షలు చేపట్టడానికి ముందుకు వచ్చారు.
రాజకీయ కక్షతోనే అరెస్ట్
ఇచ్ఛాపురం: రాజకీయకక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆరోపించారు. సోమవారం ఇచ్ఛాపురం పాత బస్టాం డ్ జంక్షన్‌లో నిర్వహించిన రిలే దీక్షల్లో అశోక్ పాల్గొని మాట్లాడారు.శిభిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయ విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం నోటికి నల్లగుడ్డతో కట్టుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్రబీసీ సాధికార సమి తి కన్వీనర్ కొండా శంకరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సాలిన ఢిల్లీయాదవ్, బి.కృష్ణయ్య, కౌన్సిలర్లు పత్రి తవిటయ్య, కాళ్ల దిలీప్, తెలుగు యువత అధ్యక్షుడు కాళ్ల జయ దేవ్, ఆశి లీలారాణి, కార్యదర్శి నందికి జాని, లీలారాణి, కొరాయి ధర్మరాజు, రెయ్యి, జానికిరావు, మాజీ ఎంపీపీ దక్కత ఢిల్లీరావు, డి.కామేష్, వూనా సంతోష్ పాల్గొన్నారు. ఫ మంగళవారం నిర్వహించిన దీక్షల్లో శిబిరం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద పూజలుచేశారు. కార్యక్రమంలో నాయకులు సీపాన రమణ, సాడి సహదేవ్‌రెడ్డి, వూనా సంతోష్,సాలిన జగదీష్‌యాదవ్, కాళ్ల జయదేవ్, రాజు, లీలారాణి, ఢిల్లీ పాల్గొన్నారు.
దీక్ష భగ్నం..ప్రతిఘటన
నరసన్నపేట: చంద్రబాబునాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా తెలుగు మహిళలు మంగళవారం పెట్రోల్ బంక్ ఆవరణలో రిలేదీక్ష చేపట్టారు. చంద్ర బాబును విడుదలచేయాలని డిమాండ్‌చేశారు. మాజీ ఎమ్మెల్యేలు బగ్గు రమణ మూర్తి, బగ్గు లక్ష్మణరావు వేర్వేరుగా పాల్గొని సంఘీభావం తెలిపా రు.కాగా శిబిరం వద్దకు ఎస్‌ఐ లక్ష్మణరావు మహిళా సిబ్బందితో వచ్చి దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. దీనిని రమణమూర్తి ప్రతిఘటించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయం వద్ద చేపట్టాలని పోలీసులు సూచిం చడం తో వ్యతిరేకించారు.ప్రభుత్వ స్థలంలో దీక్షలు చేయడం లేదని, ప్రైవేటు స్థలంలో చేపడుతున్నా ఎందుకు భయమంటూ పోలీసులను ప్రశ్నించారు. తెలుగు మహిళ సభ్యులు బలగభారతి,ఉణ్న రాజశ్రీ, గరుగుబల్లి ఝాన్సీ, పుచ్చల కల్ప న, బోయన సీతామహాలక్ష్మి, గుణుపురం రామలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసిస్తూ లుకలాం నుంచి కామేశ్వరిపేట వరకు పాదయాత్ర చేపట్టిన అనంతరం కామేశ్వరి స్వామి ఆల యంలో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కేఎల్‌ఎన్ ప్రసాద్ తదిత రులు పాల్గొన్నారు. ఫమబగాం(పోలాకి): చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళన చేపడతారని ముందస్తు చర్యగా మంగళవారం మబగాం లో మాజీ ఎమ్మెల్యే బగ్గురమణమూర్తి ఇంటికి పోలీసులు వెళ్లి ఆందోళనలో పాల్గొన వద్దని, బయటకు వెళ్లరాదని సూచించారు. ఎస్‌ఐ సత్యనారాయణ సిబ్బందితో తెల్లవారుజామున ఆయ నను అడ్డుకున్నారు. కొల్లివలసలో చం ద్రబాబును విడుదల చేయాలని కోరుతూ భైరి భాస్కరరావు ఆధ్వ ర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఫపాతపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ పాతపట్నంలో కొత్తూరు మాజీ జడ్పీటీసీ కలమట ఇందిరమ్మ, కలమట మాధురి ఆధ్వర్యంలో భారీఎత్తున నిరసన ర్యాలీ నిర్వ హించారు. నిరసన శిబి రం నుంచి పాదయాత్ర చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భం గా కేఎస్‌ఎం ప్లాజా కూడలి వద్ద పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. సైకో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సోమవారం శిబిరంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో వినా యక చవితి పూజలుచేశారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో సాగర్, పైల లక్ష్మయ్య, సైలాడ సతీష్ తదితరు లు పాల్గొన్నారు.ఫకోటబొమ్మాళి: కోటబొమ్మాళిలో తెలుగు మహిళలు దీక్షలు కొనసాగించారు. మెయిన్ రోడ్డుపై మానవహారం నిర్వహించి నిరసన తెలిపా రు. కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ మహిళ నాయకులు పూజారి శైలజ, వెలమల విజయలక్ష్మి, మట్ట సుందరమ్మ, వాన లక్ష్మి, బెండి అన్నపూర్ణ, బాడాన రమణమ్మ, దేవాది సింహ్రాదమ్మ, టీడీపీ నేతలు కింజరాపు హరివర ప్రసాద్, వెలమల కామేశ్వరరావు, తర్ర రామకృష్ణ, గొండు లక్ష్మణరావు, కర్రి అప్పారావు పాల్గొన్నారు.ఫసంతబొమ్మాళి: టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల కావా లని ఆకాంక్షిస్తూ మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌ఎల్ నాయుడు, రామా రావు, బాడాన రంగస్వామి, అప్పిని రామకృష పాల్గొన్నారు.
రాష్ట్రంలో అరాచకపాలన
కాశీబుగ్గ: చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా పలాస-కాశీబుగ్గలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్షి గౌతు శిరీష ఆద్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళ వారానికి ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్జ బాబురావు, పీరుకట్ల విఠల్, ఎస్.భారతి, మోహన్‌రావు, ఉమామహేశ్వరి, రమణ, వసంతస్వామి, ఈశ్వరరావు, సురేష్, సాంబమూర్తి, చిట్టిబాబు, వసంతరావు, శశిభూషణ్, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు కేసులతో ఏమీ చేయలేరు
శ్రీకాకుళం,(ఆంధ్రజ్యోతి)/అరసవల్లి: తప్పుడు కేసులతో చంద్రబాబు నాయుడిని ఏమీచేయలేరని మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక 80 అడుగుల రోడ్డులో గల జిల్లా పార్టీ కార్యాలయం వద్ద జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కలగ జగదీష్ ఆధ్వర్యంలో చంద్రబాబునాయుడికి మద్దతుగా నియోజకవర్గంలో యాదవులు రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుమాసాల్లో సైకో పాలన పోతుందని.. రాష్ట్రానికి పట్టిన శని కూడా విరగడవుతుందన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మాట్లా డుతూ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వికృతపాలనకు చరమగీతం పాడేరోజులు అతిదగ్గరలోనే ఉన్నాయని చెప్పారు.మచ్చలేని చంద్రునిగా అతిత్వరలో చంద్రబా బు బయటకు వస్తున్నారని, ప్రజలు తీర్పునిచ్చేందుకు ఇప్పటికే సిద్ధమైపో యారని వెల్లడించారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చింతల రామకృష్ణ, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తోణంగి, వెంకన్నయాదవ్, పీఎంజే బాబు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు కొర్ను నాగార్జున ప్రతాప్, కోండ్రు పాపారావు, కలగ శివ, నక్క రామన్న, బొట్టా కామరాజు, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు కుప్పిలి వెంకట్రావు, డివిజన్ ఇన్‌చార్జి కవ్వాడి సుశీల, కొమర కమల, బలివాడ కళావతి , జనసేన నాయకులు పేడాడ రామ్మోహనరావు, గేదెల చైతన్య పాల్గొన్నారు.