ధాన్యం కొనుగోలు లేక అవస్థలు పడుతున్నాం

ABN , First Publish Date - 2023-02-06T23:33:47+05:30 IST

ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేర కు టెక్కలి మేజర్‌ పంచాయతీ పరిధి గ్రామ సచివాలయం-4 పరిధిలోని సుమారు 30 మంది రైతులు సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి తమ సమస్యను విన్నవించుకునేం దుకు వచ్చారు.

 ధాన్యం కొనుగోలు లేక అవస్థలు పడుతున్నాం
ధాన్యం కొనుగోలు చేయాలంటూ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వచ్చిన రైతులు

‘స్పందన’లో ఇళ్ల స్థలాలు, ఇతర సమస్యలపై ఫిర్యాదులు

టెక్కలి రూరల్‌: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేర కు టెక్కలి మేజర్‌ పంచాయతీ పరిధి గ్రామ సచివాలయం-4 పరిధిలోని సుమారు 30 మంది రైతులు సోమవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి తమ సమస్యను విన్నవించుకునేం దుకు వచ్చారు. మా సచివాలయం పరిధిలో సుమారు 450 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలుకు ఉన్నప్పటికీ సంబం ధిత అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డికి వినతిపత్రం అందించారు. అలాగే సంత బొమ్మాళి మండలం సంధిపేటకి చెందిన రైతులు.. ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఫిర్యాదు చేశారు. ఇతర వినతుల్లో కొన్ని ఇలా... స్థానిక జగతిమెట్ట జగనన్నకాలనీ లేఅవుట్‌లో 256 నెంబరుతో స్థలం కేటాయించారని, అయితే నేటికీ స్థలం అప్పగించ లేదని ఆది ఆంధ్రా వీధిలో నివాస ముంటున్న బి.నందిని వినతిపత్రం అందించారు. జగనన్న చేదోడు పథకానికి మాకు అన్ని అర్హత లున్నా ఇప్పటి వరకు మంజూ రు చేయాలేదని పెద్దసాన గ్రామ సచివాలయం పరిధిలోని పలువురు సబ్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. సంక్షేమ పథకాలపై సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ను సమా చారం కోరగా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని పలువురు గ్రామ స్థులు ఫిర్యాదు చేశారు. రావివలస, దామోదరపురం, చిన్న నారాయణపురం గ్రామాల శ్మశాన వాటికల్లో మౌలిక వసతు లు లేవని, స్థలాలు ఆక్రమణలకు గురయ్యాయని, తక్ష ణం తగు చర్యలు తీసుకోవాలని రావివలస పంచాయతీ పరిధి లోని ప్రజలు వినతపత్రం అందిం చారు. రావివలసలోని ఎల్లాయీస్‌ పరిశ్రమలో ఏవోడీ ప్లాంట్‌ ఉండడంతో నైట్రోజన్‌, ఆర్గాన్‌ గ్యాస్‌ వల్ల ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు వస్తు న్నాయని, తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు. వివిధ సమస్యలపై 20 వినతులు వచ్చినట్లు స్పందన అధికారులు తెలిపారు.

పంచాయతీ స్థలం ఆక్రమణపై ఫిర్యాదు

మందస: భైరిసారంగపురంలో కమ్యూనిటీ భవన నిర్మించనున్న స్థలంలో కొంత భాగాన్ని ఈ గ్రామానికి చెందిన ఆర్‌.లింగయ్య ఆక్రమించుకున్నారని సోమవారం ‘స్పందన’లో తహసీల్దార్‌ బి.పాపారావుకు గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ స్థలం చుట్టూ కంచె నిర్మాణం చేపట్టారన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో గ్రామస్థులు ఎస్‌.సింహాచలం, జి.పాపారావు, ఆర్‌. రమేష్‌ తదితరులున్నారు.

ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలి

వజ్రపుకొత్తూరు: నగరంపల్లి పంచాయతీలో పండిన ప్రతి ధాన్యం గింజా కొనుగోలు చేయాలని ఏపీ రైతు సం ఘం జిల్లా నాయకుడు టి.భాస్కరరావు, మండల కన్వీనర్‌ ఎన్‌.మోహనరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమ వారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. నగరంపల్లి రెవెన్యూ పరిధిలో ఇప్పటి వరకు 60 శాతం ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, మిగిలిన ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. మిగులు ధాన్యం కల్లాల్లో ఉండిపోవడంతో అడవి పందులు, పందికొక్కులు పాడు చేసి నష్టపోతున్నారని వాపోయారు. తక్షణం తగు చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరారు. అనం తరం తహసీల్దార్‌ అప్పలస్వామికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు డి.భాస్కర రావు, బి.చెల్లయ్య, బి.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:33:49+05:30 IST