ఓటు.. మన బాధ్యత

ABN , First Publish Date - 2023-01-26T00:25:32+05:30 IST

ఓటును వినియోగించుకోవడం మనందరి బాధ్యతని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో బుధవారం నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఓటు.. మన బాధ్యత
కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠ్కర్‌

- కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌

అరసవల్లి, జనవరి25: ఓటును వినియోగించుకోవడం మనందరి బాధ్యతని కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ పేర్కొన్నారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో బుధవారం నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటుహక్కును వినియోగించుకోవడంలో యువత వయోవృద్ధులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అందరూ ఓటుహక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతీ పౌరుడు ఓటరుగా నమోదుకావాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన వారంతా ఓటుహక్కు వినియోగించుకుని దేశాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఓటరు నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఓటుహక్కు వినియోగంపై విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నూతనంగా ఓటు హక్కు పొందిన యువతీ, యువకులకు ఓటరు కార్డులను అందజేశారు. ఉత్తమ బీఎల్‌వోలకు, ఎక్కువసార్లు ఓటుహక్కును వినియోగించుకున్న వయోవృద్ధులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ముందుగా వివిధ కళాశాలల విద్యార్థులు, ఓటర్లు, అధికారులు, సిబ్బంది ఏడురోడ్ల కూడలి నుంచి బాపూజీ కళామందిర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఓటుహక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కేవీ అప్పలనాయుడు, ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.మోహనరాజు, మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-26T00:25:34+05:30 IST