20 ఏళ్లుగా వెట్టిచాకిరీ
ABN , First Publish Date - 2023-08-22T23:45:00+05:30 IST
ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పాసై కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 20 ఏళ్ల నుంచి వెట్టిచాకిరీ చేస్తున్నా తమను రెగ్యులరైజ్ చేయలేదని, కనీసం సమాన పనికి సమాన వేతనం ఉత్తర్వులను అమలు చేయడం లేదని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం మందస, సంతబొమ్మాళి ఎమ్మార్సీ కార్యాల యాల ఎదుట నిరసన తెలిపారు.
హరిపురం/మందస/సంతబొమ్మాళి: ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పాసై కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 20 ఏళ్ల నుంచి వెట్టిచాకిరీ చేస్తున్నా తమను రెగ్యులరైజ్ చేయలేదని, కనీసం సమాన పనికి సమాన వేతనం ఉత్తర్వులను అమలు చేయడం లేదని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు మంగళవారం మందస, సంతబొమ్మాళి ఎమ్మార్సీ కార్యాల యాల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ సంఘ నేతలు మాట్లాడుతూ.. విద్యాశాఖకు సంబంధించిన అన్ని పనులతోపాటు జగనన్న విద్యాకానుక పంపిణీలోనూ తమను వినియోగించుకుంటున్నా కనీసం నెలనెలా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్వీసు లను రెగ్యులర్ చేయాలని, ఎంటీఎస్ పద్ధతిలో వేతనాలి వ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో ఎమ్మార్సీ సిబ్బంది రాంబాబు, లవకుమార్, ‘భవిత’ ఉపాధ్యాయులు ప్రసాద్, అంబిక, సీఆర్పీలు జానకిరామయ్య, మాధవదాస్, పురుషోత్తం, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు.