8న వంశధార నీరు విడుదల
ABN , First Publish Date - 2023-06-26T23:22:27+05:30 IST
గొట్టాబ్యారేజి కుడి, ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూలై 8వ తేదీన సాగునీటిని విడుదల చేయనున్నట్లు వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ డోల తిరుమలరావు సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యారేజీ వద్ద నీటి నిల్వ పుష్కలంగా ఉందని, రైతు దినోత్స వం సందర్భంగా సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు.
హిరమండలం: గొట్టాబ్యారేజి కుడి, ఎడమ ప్రధాన కాలువ ద్వారా జూలై 8వ తేదీన సాగునీటిని విడుదల చేయనున్నట్లు వంశధార ప్రాజెక్టు ఎస్‌ఈ డోల తిరుమలరావు సోమ వారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్యారేజీ వద్ద నీటి నిల్వ పుష్కలంగా ఉందని, రైతు దినోత్స వం సందర్భంగా సాగునీరు విడుదల చేస్తున్నామన్నారు. ఎడమ కాలువ ద్వారా 1.42 లక్షల ఎకరాలకు, కుడి కాలువ ద్వారా 82 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.