నేడు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2023-01-01T23:51:51+05:30 IST

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమ వారం విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించ నున్నా రు. ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శ నానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విష్ణు మూర్తి లక్ష్మీదేవితో కలిసి గరుత్మం తునిపై వచ్చి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నా రన్నది ప్రతీతి.

నేడు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజలు
విజయదుర్గా అమ్మవారి ఆలయం వద్ద క్యూలైన్‌ ఏర్పాటు చేస్తున్న దృశ్యం

టెక్కలి/నందిగాం: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమ వారం విష్ణు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించ నున్నా రు. ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శ నానికి ఏర్పాట్లు చేస్తున్నారు. విష్ణు మూర్తి లక్ష్మీదేవితో కలిసి గరుత్మం తునిపై వచ్చి ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నా రన్నది ప్రతీతి. విష్ణు స్వరూపుని జాజిపూలతో అలాగే మహావిష్ణువు ధరించి సుదర్శన చక్రం వలె ఉండే జిలాబీని నైవేద్యంగా పెడతారు. విష్ణు భక్తులు ఈ రోజున ఉపవాసం ఉండి ఆలయాలను దర్శిం చుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. నందిగాం మండలం సుబ్బమ్మ పేట లక్ష్మీ నృసింహ ఆలయం, పెంటూరు వేంకటేశ్వర స్వామి, టెక్కలి లక్ష్మీ నరసింహస్వామి, శ్యామసుందరస్వామి, టెక్కలి, కోవె లపేట, సంతబొమ్మాళి మండలం కాశీపురం, కోటబొమ్మాళి మండ లం గుంజిలోవ వేంకటేశ్వర స్వామి ఆలయాలు, నంబాళ్ల పేట శివ బాలాజీ, పోలాకి మండలం గాతలవలస, మందస వాసుదేవ పెరుమాళ్‌ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశిని పురస్క రించుకుని ఏర్పాట్లు పూర్తిచేశారు.

విజయదుర్గా అమ్మవారి ఆలయంలో...

శ్రీకాకుళం కల్చరల్‌: వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరంలోని విజయదుర్గా ఆలయంలో సోమవారం అమ్మవారు నామాకర్షిణి (బాలాజీ) అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం, సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం నిర్వహి స్తున్నట్లు నిర్వాహ కులు తెలిపారు. ఈ సంద ర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండేలా క్యూలైన్లను ఆదివారం ఏర్పాటు చేశారు.

ఇచ్ఛాపురంలో..

ఇచ్ఛాపురం: పట్టణంలోని గిలాయివీధిలో కొలువుదీరిన వైభవ వేంకటేశ్వరాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిం చారు. సోమవారం వేకువ జాము నుంచే ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

బూరవెల్లిలో..

గార: బూరవెల్లిలో ప్రసిద్ధ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) ఉత్సవం నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి సీతారామస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచే స్వామికి గరుడ వాహనంపై తిరువీధి, అనంతరం స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఉంటాయన్నారు.

Updated Date - 2023-01-01T23:51:53+05:30 IST