అమ్మో.. హరిశ్చంద్రపురం మలుపు !

ABN , First Publish Date - 2023-08-27T23:33:44+05:30 IST

హరిశ్చంద్ర పురం నుంచి జాతీయరహదా రికి వెళ్లే మార్గంలో ఉండే ఓ మలుపు ప్రమాదాలకు నిల యంగా మారింది. రోడ్డుకు ఇరువైపుల చెట్లు, ముళ్లపొ దలు, దట్టంగా పిచ్చిమొక్కలు పెరగడంతో మలుపులో దగ్గర కు వచ్చే వరకూ ఎదురుగా వచ్చిన వాహనాలు కనిపించకపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల వారంరోజుల వ్యవధిలో మూడు మోటారు సైకిళ్లు ఢీకొని నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఆ సంఘటన జరిగి న వారంరోజుల్లో ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను మరో మోటర్‌ సైకిల్‌ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతుం డడంతో పలుసార్లు అధికారులు దృష్టికి తీసుకవెళ్లినాసంబందిత అర్‌అండ్‌బీ అధికారులు స్పందించడంలేదని పలువురు వాహనచో దకులు వాపోతున్నారు.

 అమ్మో.. హరిశ్చంద్రపురం మలుపు !
ప్రమాదాలకు నిలయంగా మారిన మలుపు :

కోటబొమ్మాళి: హరిశ్చంద్ర పురం నుంచి జాతీయరహదా రికి వెళ్లే మార్గంలో ఉండే ఓ మలుపు ప్రమాదాలకు నిల యంగా మారింది. రోడ్డుకు ఇరువైపుల చెట్లు, ముళ్లపొ దలు, దట్టంగా పిచ్చిమొక్కలు పెరగడంతో మలుపులో దగ్గర కు వచ్చే వరకూ ఎదురుగా వచ్చిన వాహనాలు కనిపించకపోవడంతో తరచూ ఇక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల వారంరోజుల వ్యవధిలో మూడు మోటారు సైకిళ్లు ఢీకొని నలుగురు తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఆ సంఘటన జరిగి న వారంరోజుల్లో ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను మరో మోటర్‌ సైకిల్‌ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. నిత్యం ఏదో ఒక సంఘటన జరుగుతుం డడంతో పలుసార్లు అధికారులు దృష్టికి తీసుకవెళ్లినాసంబందిత అర్‌అండ్‌బీ అధికారులు స్పందించడంలేదని పలువురు వాహనచో దకులు వాపోతున్నారు.

Updated Date - 2023-08-27T23:33:44+05:30 IST