చిన్నబజార్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం
ABN , First Publish Date - 2023-03-05T23:29:13+05:30 IST
టెక్కలిలో ఆదివారం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణ రోజుల్లోనే చిన్నబజారు రోడ్డు వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఆదివారం చికెన్, చేపల మార్కెట్, కూరగాయలు కొనుగోలుకు ఎక్కువ మంది తరలి రావడంతో ద్విచక్ర, రవాణా వాహనాలతో ఒక్కసారి ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు గంటసేపు వాహనాల రాకపోక లకు అంతరాయం ఏర్పడింది.
టెక్కలి రూరల్: టెక్కలిలో ఆదివారం ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణ రోజుల్లోనే చిన్నబజారు రోడ్డు వాహనాలతో రద్దీగా ఉంటుంది. ఆదివారం చికెన్, చేపల మార్కెట్, కూరగాయలు కొనుగోలుకు ఎక్కువ మంది తరలి రావడంతో ద్విచక్ర, రవాణా వాహనాలతో ఒక్కసారి ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు గంటసేపు వాహనాల రాకపోక లకు అంతరాయం ఏర్పడింది. స్థానిక జడ్పీ రోడ్డులోని సంతోషిమాత ఆలయం వద్ద కల్వ ర్టు నిర్మాణం పనులు సాగుతుండడంతో ఇందిరాగాంధీ కూడలి నుంచి చిన్నబజారు కూడలి వరకు వాహనాల రాకపోకలు నిషేధించారు. దీంతో అటు వెళ్లే వాహనదారులు ప్రత్యా మ్నాయంగా ఈ రోడ్డును వినియోగిస్తుండడం.. అసలే ఇరుకు రోడ్డు రోడ్డు.. ఆపై ఇరు వైపులా చిరుదుకాణాలు ఉండడంతో ట్రాఫిక్‌కు తరచూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలువురు స్థానికులు స్పం దించి వాహనాలకు ఒకవైపుగా దారి ఇవ్వడంతో ట్రాఫిక్ క్లియర్ అయింది.