సర్వం సిద్ధం
ABN , First Publish Date - 2023-11-19T23:52:31+05:30 IST
శివ పూజకు సర్వం సిద్ధమైంది. కార్తీకమాస తొలి సోమవారా నికి శివాలయాలు ముస్తాబయ్యాయి. శ్రీకాకుళం లోని ఉమారుద్రకోటేశ్వరాలయం, టెక్కలి మండ లం రావివలసలోని ఎండలమల్లికార్జున స్వామి ఆలయం, జలుమూరు మండలం శ్రీముఖలిం గంలోని ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు.

- నేడు కార్తీక మాస తొలి సోమవారం
- ముస్తాబైన శివాలయాలు
శ్రీకాకుళం కల్చరల్/ టెక్కలి రూరల్/ జలుమూరు, నవంబరు 19: శివ పూజకు సర్వం సిద్ధమైంది. కార్తీకమాస తొలి సోమవారా నికి శివాలయాలు ముస్తాబయ్యాయి. శ్రీకాకుళం లోని ఉమారుద్రకోటేశ్వరాలయం, టెక్కలి మండ లం రావివలసలోని ఎండలమల్లికార్జున స్వామి ఆలయం, జలుమూరు మండలం శ్రీముఖలిం గంలోని ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఇందుకు సంబంధించి దేవదాయశాఖ అధికారులు, ఆలయ నిర్వాహ కులు ఏర్పాట్లు పూర్తిచేశారు. షామియానాలతో పాటు క్యూలైన్లు, భారీకేడ్లు సిద్ధం చేశారు. తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించను న్నారు. రావివలసలో సీత కోనేరు, కేశఖండన ప్రాంతాల వద్ద రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేప ట్టారు. డీఎస్పీ డీ.బాలచంద్రారెడ్డి పర్యవేక్షణలో 60 మంది పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించనున్నారు. శ్రీముఖలిం గంలోనూ భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్.ఐ పి.పారినాయుడు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం శ్రీముఖలింగేశ్వ రంలో స్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్య లో తరలివచ్చారు.