నేడు శ్రీరామనవమి

ABN , First Publish Date - 2023-03-30T00:03:22+05:30 IST

శ్రీరామనవమి వేడుకలకు నగరంలోని పలు సీతా రామాలయాలు ము స్తాబయ్యాయి. గురు వారం జరిగే ఉత్సవా ల కోసం పాలకొండ రోడ్డులోని కోదండరామాలయం, పుణ్యపు వీధిలోని సీతారామచంద్రమూర్తి సహిత సువత్సల అభయాంజనేయస్వామి ఆలయం, పీఎన్‌కాలనీ వరసిద్ధి వినాయక ఆలయాలు సిద్ధమ య్యాయి.

నేడు శ్రీరామనవమి
విద్యుత్‌ దీపాల కాంతుల్లో శ్రీకాకుళంలోని కోదండ రామాలయం

శ్రీకాకుళం కల్చరల్‌: శ్రీరామనవమి వేడుకలకు నగరంలోని పలు సీతా రామాలయాలు ము స్తాబయ్యాయి. గురు వారం జరిగే ఉత్సవా ల కోసం పాలకొండ రోడ్డులోని కోదండరామాలయం, పుణ్యపు వీధిలోని సీతారామచంద్రమూర్తి సహిత సువత్సల అభయాంజనేయస్వామి ఆలయం, పీఎన్‌కాలనీ వరసిద్ధి వినాయక ఆలయాలు సిద్ధమ య్యాయి. ఆలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఇచ్ఛాపురం: పట్ట ణంలోని కోదండరామస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా గురు వారం స్వామివారి కల్యాణం నిర్వహించేందుకు ఆల య ధర్మకర్తలు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశారు. శ్రీరామ జననం, అభిషేకాలు, సీతారామ కల్యాణం, పూజలు జరుగుతాయని తెలిపారు. హిరమండలం: బ్యారేజి సెంటర్‌లోని రామా లయంలో సీతారాముల కల్యాణానికి బుధవారం పందిరి రాట నిర్వహించారు. ఆలయాన్ని పచ్చతోరణలు, విద్యుత్‌ దీపాలతో అందంగా అలం కరించారు. గు రువారం శ్రీరాముని కల్యాణం, శుక్రవారం సాయంత్రం పట్టాభి షేకం నిర్వస్తా మని అర్చకులు శ్రీనివాస్‌ శర్మ చెప్పారు. పోలాకి: శ్రీరామనవమి ఉత్సవాలకు రామమందిరాలను ముస్తాబు చేశారు. రాళ్లపాడు, ముప్పిడి, దీర్గాశి, గాతలవలస, బెలమర, దండులక్ష్మీపురం, రాజారాంపురం, గొల్లలవలస, పోలాకి, నర్సాపురం, గజపతినగరం, వనితమండలం గ్రామాల్లో ఆలయాలను అలంకరించారు.

ఆకట్టుకున్న సీతారాముల సైకత శిల్పం

ఆమదాలవలస: శ్రీరామనవమి సందర్భంగా తెలంగా ణ రాష్ట్ర కొత్తగూడేం జిల్లా భద్రాచలం దేవస్థానం ఆవరణలో గాజులకొల్లివలసకు చెందిన సైకత శిల్పి గేదెల హరికృష్ణ వేసిన సీతారామలక్ష్మణ హనుమాన్‌ సహిత శ్రీరామదాసు సైకత శిల్పం ఆకట్టుకుంది. సీతారాముల కల్యాణ మహోత్సవాల సందర్భంగా దేవస్థానం అధికారుల ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి సైకత శిల్పాలను తీర్చిదిద్దినట్లు హరికృష్ణ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

సూదిపై ‘శ్రీరామనవమి’

కాశీబుగ్గ: పలాస ము న్సిపాల్టీ పరిధి 21వ వార్డుకు చెందిన సూ క్ష్మ కళాకారు డు కొత్తపల్లి రమేష్‌ గుండు సూదిపై శివధనస్సులో శ్రీరామనవమి అని బుధవారం తయారు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా పలుచటి బంగారం రేకుపైన సూక్ష్మ కళాకండాన్ని బంగారంతో తయారు చేశానని, దీనిఎత్తు 0.5 సెంటి మీటరు, వెడల్పు 1.5 అని, దీని బరువు 0.100 మిల్లీ గ్రాములు అని తెలియజేశారు.

Updated Date - 2023-03-30T00:03:22+05:30 IST